Minister Savitha: కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు! Norway: భారత్‌కు నీతులు చెప్పడం ఆపండి.. ఆ దేశ ప్రగతిని చూసి నేర్చుకోండి: నార్వే పత్రిక సంచలన వ్యాఖ్యలు! Atchennaidu: ఖరీఫ్ రైతులకు కేంద్రం తీపికబురు.. పంటల మద్దతు ధరల పెంపుతో రైతుల్లో ఆశలు! Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష! హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు! Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! Chandrababu: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు సూచన! Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి! Minister Savitha: కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు! Norway: భారత్‌కు నీతులు చెప్పడం ఆపండి.. ఆ దేశ ప్రగతిని చూసి నేర్చుకోండి: నార్వే పత్రిక సంచలన వ్యాఖ్యలు! Atchennaidu: ఖరీఫ్ రైతులకు కేంద్రం తీపికబురు.. పంటల మద్దతు ధరల పెంపుతో రైతుల్లో ఆశలు! Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష! హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు! Prajavedhika: వైసీపీ నేతల దౌర్జన్యం.. నల్లమాడ రైతు ఇంటి కూల్చివేతపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! Chandrababu: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు సూచన! Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి!

Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష! హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు!

Cyber Crimes: అమరావతిలో సైబర్ మరియు ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైబర్ మోసాలకు తక్షణ స్పందన, బాధితులకు త్వరగా సహాయం అందించే విధానాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

Published : 2026-05-13 19:18:00

బాధితుల నుంచి 1930 హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు..

రూ.652 కోట్ల నష్టం వెలుగులోకి..

అమరావతిలో సైబర్ మరియు ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైబర్ మోసాలకు తక్షణ స్పందన, బాధితులకు త్వరగా సహాయం అందించే విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడి మోసాలు (ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్) అత్యంత పెద్ద ఆర్థిక నేరాలుగా మారుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు ఏపీలో సైబర్, ఆర్థిక నేరాల కారణంగా ప్రజలు రూ.652 కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు మొత్తం 9.29 లక్షల కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు.

సమీక్షలో ముఖ్యంగా “గోల్డెన్ అవర్” విధానం, ఏపీ సైబర్ పాలసీ, ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఫిషింగ్, విషింగ్, క్రెడిట్-డెబిట్ కార్డు మోసాలు, ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలు భారీగా మోసపోతున్నారని అధికారులు వివరించారు.

అయితే సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లతో కలిసి పనిచేయడం వల్ల రూ.116 కోట్లకు పైగా మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా కాపాడగలిగామని అధికారులు తెలిపారు. బ్యాంకులతో మరింత సమన్వయం పెంచుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర స్థాయిలో సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణ కోసం సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎంకు వివరించారు.

ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ హాజరయ్యారు. అలాగే ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కెపీసీ గాంధీ, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కాల్స్, లింకులు, పెట్టుబడి ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. సైబర్ నేరాలపై వేగంగా స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు.

Spotlight

Read More →