Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Auto Mutation: రిజిస్ట్రేషన్ అయిన రోజే పేరు మార్పు... ఏపీలో ఆటో మ్యుటేషన్‌తో ఈజీ ప్రాసెస్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ‘అర్బన్ ఆటో మ్యుటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్’ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింద

2026-01-18 07:49:00
Ring Road Expansion: అక్కడ రింగ్ రోడ్డు విస్తరణ! రూ.1.35 కోట్లతో... పట్టణ రూపురేఖలే మారనున్నాయ్! ఇన్నాళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ‘అర్బన్ ఆటో మ్యుటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్’ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు (Registration) పూర్తైన రోజే ఆస్తి యజమాని వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో స్వయంచాలకంగా అప్‌డేట్ అవుతాయి. దీంతో ప్రజలకు సమయం ఆదా అవడమే కాకుండా అవినీతి తగ్గే అవకాశాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

AP At Davos: దావోస్‌ వేదికపై ఏపీ ఎజెండా.. గ్లోబల్ పెట్టుబడులపై సీఎం ఫోకస్!

గత ఏడాది ఆగస్టు నెలలో ఈ కొత్త 'అర్బన్ ఆటో-మ్యుటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్' (Auto Mutation) విధానాన్ని రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇదే తరహా విధానాన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో నగర ప్రాంతాల్లోనూ దీనిని విస్తరించారు. ఆస్తి అమ్మకం, కొనుగోలు, వారసత్వం లేదా బహుమతి వంటి లావాదేవీలన్నీ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారానే పూర్తవుతాయి.

US Students Alert: యూఎస్‌లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ అలర్ట్!

ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత గత ఐదు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ఆస్తుల మ్యుటేషన్లు పూర్తయ్యాయి. దీని వల్ల అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటంతో పాటు, పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తొలగిపోయింది. అంతేకాదు, ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.8 కోట్ల ఆదాయం కూడా సమకూరింది.

Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం!

పాత విధానంలో అయితే రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఫీజుల పేరుతో ఆలస్యం, అదనపు ఖర్చులు ఎదురయ్యేవని ప్రజలు ఆరోపించేవారు. కానీ ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డేటాను మున్సిపల్ డేటాతో అనుసంధానం చేయడంతో రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే మ్యుటేషన్ కూడా పూర్తవుతోంది.

Lucky Draw: లక్కీ డ్రాల ముసుగులో భారీ మోసం… సెలబ్రిటీలైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ!

అయితే ఈ కొత్త విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొత్త ఫ్లాట్లకు అసెస్‌మెంట్ నంబర్లు కేటాయించడంలో, ఖాళీ స్థలాలపై పన్నులు విధించడంలో ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం మీద ఈ విధానం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Chabahar Port: ట్రంప్ ఆంక్షలపై భారత్ స్పందన.. చాబహార్ పోర్టుపై స్పష్టత!
Pongal Festival: జల్లికట్టు వీరులకు సీఎం స్టాలిన్ బిగ్ గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన.!!
తిరుమల భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది!
Medaram prasadam: భక్తులకు శుభవార్త.. మేడారం ప్రసాదం డోర్ డెలివరీ!
UK Gangs: బ్రిటన్ లో పాకిస్థానీ గ్యాంగుల దారుణాలు... సిక్కు, హిందూ అమ్మాయిలే టార్గెట్! బయటపడ్డ షాకింగ్ నిజాలు..

Spotlight

Read More →