Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు!

పాకిస్థాన్‌లో జరుగుతున్న సంచలన పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన ఆస్తులపై జరిగిన అనుమానాస్పద అగ్నిప్రమాదాలు, పేలుళ్లు వెనుక మర్మ మనుషుల హస్తం ఉందా?

2026-01-24 16:32:00
Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!!
  • అసీమ్ మునీర్‌కు అర్థంకాని దాడులు.. పాకిస్థాన్ ఆర్మీకి పెద్ద సవాల్
    మర్మ మనుషులు ఎవరు? పాకిస్థాన్‌లో 107 ఉగ్రవాదుల అంతం 
    దావూద్ జీవించి ఉన్నాడా? అతని సామ్రాజ్యం మాత్రం కూలిపోతోంది
Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!!

ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అక్కడ ఏదో పెద్ద ప్రకంపనలే జరుగుతున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) సామ్రాజ్యం ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు కరాచీలో ఏం జరుగుతోంది? ఆ "మర్మ మనుషులు" ఎవరు? అన్న విషయాలను మనం వివరంగా తెలుసుకుందాం.

Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్!

1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం మరియు అతని గ్యాంగ్ పాకిస్థాన్‌కు పారిపోయారు. అప్పటి నుండి పాకిస్థాన్ ప్రభుత్వం వాడు మా దేశంలో లేడు అని అబద్ధాలు చెప్తూనే ఉంది. కానీ, భారత్ మాత్రం దావూద్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరెంట్ బిల్లులతో సహా అన్ని ఆధారాలను ఐక్యరాజ్యసమితిలో సమర్పించింది. తాజాగా కరాచీలో గుల్ ప్లాజా అనే భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది సామాన్యమైన ప్రమాదం కాదు, ఎందుకంటే ఈ గుల్ ప్లాజా దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందినది. పాకిస్థాన్‌లో ఉంటూ వాడు దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ.

సాధారణంగా అగ్నిప్రమాదం జరిగితే మంటలు బిల్డింగ్ అంతా వ్యాపిస్తాయి. కానీ గుల్ ప్లాజాలో జరిగినది చాలా వింతగా ఉంది. మొదటి అంతస్తులో మంటలు వచ్చాయి, మళ్ళీ మూడవ అంతస్తులో మంటలు చెలరేగాయి, కానీ మధ్యలో ఉన్న రెండో అంతస్తు మాత్రం క్షేమంగా ఉంది. రెండో అంతస్తులో బట్టల దుకాణాలు ఎక్కువగా ఉన్నా, అక్కడ ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే, ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి చేసిన "సాబోటాజ్" అటాక్ అని స్పష్టమవుతోంది. ఆ "మర్మ మనుషులు" కేవలం దావూద్ ఆస్తులనే టార్గెట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

అదే రోజు కరాచీ పోర్టులో కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ వేల సంఖ్యలో కార్గో కంటైనర్లు ఉన్నప్పటికీ, ఒకే ఒక కంటైనర్ మాత్రం పేలిపోయింది. పక్కనే ఉన్న ఇతర కంటైనర్లకు ఎలాంటి నష్టం జరగలేదు. ఇలాంటి ఫలితం రావాలంటే కచ్చితంగా "స్పైస్ బాంబ్స్" వంటి అత్యాధునిక సాంకేతికతను వాడి ఉండాలి. దీనికి తోడు, ఒక మిలిటరీ వెహికల్ పార్కింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా పేలిపోయింది. ఇవన్నీ చూస్తుంటే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌కు ఏం జరుగుతుందో అర్థం కాక వణికిపోతున్నాడని చెప్పవచ్చు.

పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వారి నమ్మకమైన మిత్రదేశం చైనా కూడా ఇప్పుడు భయపడుతోంది. కరాచీలో చైనాకు సంబంధించిన ఒక సాటిలైట్ నెట్వర్క్ ఆఫీస్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో చైనా డిప్లొమాట్లు తమ ప్రాణాలకు అక్కడ రక్షణ లేదని భావిస్తున్నారు. అందుకే వారు తమ ఎస్టాబ్లిష్‌మెంట్లను పాకిస్థాన్ నుండి ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్‌కు తరలించాలని నిర్ణయించుకున్నారు. భారత్ మిత్రదేశమైన ఆఫ్ఘనిస్థాన్‌కు చైనా వెళ్లడం పాకిస్థాన్‌కు ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి.

ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యం ఒక పెద్ద చిక్కులో పడింది. ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడానికి పాకిస్థాన్‌ను ఒక బేస్‌గా వాడుకోవాలని చూస్తున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తే, పాకిస్థాన్‌లో ఉన్న షియా ముస్లింలు అసీమ్ మునీర్ అంతు చూస్తారు. పోనీ వెళ్లకపోతే అమెరికా ఊరుకోదు. ఈ క్రమంలోనే అమెరికా ఇచ్చిన అత్యంత ఖరీదైన ఆయుధాల కంటైనర్లు మాయమైపోయాయని మునీర్ అబద్ధాలు చెప్తున్నాడు. ఆయుధాలు ఉంటేనే కదా యుద్ధానికి వెళ్ళేది, అవి లేవని తప్పించుకోవాలని చూస్తున్నాడు.

పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 107 మంది తీవ్రవాదులను ఈ మర్మ మనుషులు మట్టుబెట్టారు. అంతర్గతంగా దాడులు, బయట నుండి అంతర్జాతీయ ఒత్తిడి, మరోవైపు మతపరమైన యుద్ధ భయం.. ఇలా పాకిస్థాన్ ప్రస్తుతం ఒక పెద్ద క్రషర్‌లో నలిగిపోతోంది. దావూద్ ఇబ్రహీం ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్నది ఒక పెద్ద మిస్టరీగా మారగా, అతని సామ్రాజ్యం మాత్రం కళ్లముందే తగలబడిపోతోంది. మరి ఈ పరిణామాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి.

Spotlight

Read More →