Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Elephant threat: గ్రామాలపై ఏనుగు ముప్పు.. 13 మంది మృతి.. . అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు.. అయినా తగ్గని! Water heaters: వాటర్ హీటర్‌తో జాగ్రత్త.. ప్లాస్టిక్ బకెట్ తప్పనిసరి.. UPలో షాక్ ఘటన! Grok: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. గ్రోక్ నివేదికపై అసంతృప్తి! మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!! Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా! Veterinary News: గొర్రె రక్తంతో పాము విషానికి మందా..? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Elephant threat: గ్రామాలపై ఏనుగు ముప్పు.. 13 మంది మృతి.. . అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు.. అయినా తగ్గని! Water heaters: వాటర్ హీటర్‌తో జాగ్రత్త.. ప్లాస్టిక్ బకెట్ తప్పనిసరి.. UPలో షాక్ ఘటన! Grok: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. గ్రోక్ నివేదికపై అసంతృప్తి! మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!! Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా! Veterinary News: గొర్రె రక్తంతో పాము విషానికి మందా..? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!

అన్వేష్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రచ్చ… రెండు రోజుల్లో ఇంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారా.!!

2026-01-02 19:48:00
Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది!

తెలుగు రాష్ట్రాలో ఇటీవల సోషల్ మీడియా సినీ వర్గాలలో  పెద్ద చర్చకు కారణమైన వివాదం ఇంకా చల్లారలేదు. ఒక సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మొదట చిన్న రగడలా కనిపించినా, అవి క్రమంగా పెద్ద దుమారంగా మారాయి. ఆ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్‌ స్పందించడంతో ఈ అంశం మరింత వేడెక్కింది. శివాజీ క్షమాపణ చెప్పినా కూడా వివాదం పూర్తిగా ముగియలేదన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్త ఏడాది కానుక: జియో, ఎయిర్‌టెల్‌కు ధీటుగా రంగంలోకి బీఎస్‌ఎన్‌ఎల్! ఉచితంగా ఆ సేవలు..

ఈ వ్యవహారంలో ఒక వర్గం శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా, మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. ఇదే సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. హిందూ పురాణ  దేవతలు ఉదాహరణలుగా తీసుకుని మాట్లాడిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపది వంటి వారిని కించపరిచేలా వ్యాఖ్యానించారనే ఆరోపణలు రావడంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా అన్వేష్‌పై మండిపడింది.

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే.. ఇది ఉంటే చాలు, ఫాస్ట్ నెట్‌వర్క్ మీకే..!

ఈ విమర్శల ప్రభావం వెంటనే కనిపించింది. అన్వేష్ యూట్యూబ్‌ ఛానల్‌కు ఉన్న ఫాలోవర్స్‌లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. అనేక మంది ఆన్‌సబ్‌స్క్రైబ్‌ చేయగా, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అన్వేష్ చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు.

A380: సీక్రెట్ రూమ్స్... ప్రయాణికులకు తెలియని A380 అంతర్గత ప్రపంచం!

ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పరోక్షంగా స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేర్లు ప్రస్తావించకపోయినా, ఆయన చెప్పిన మాటలు ఎవరి ఉద్దేశ్యంతోనో అన్నది నెటిజన్లకు స్పష్టంగానే అర్థమవుతోంది. “ఒక నేరస్థుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు కానీ పది మంది ఈసడిస్తే పది రోజుల్లో మారతాడు” అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.

E-KYC: రేషన్ కార్డు e-KYC తప్పనిసరి.. మరోసారి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం!

ఇక  ఏ మచ్చలేని వ్యక్తులపై బురద జల్లడం, వ్యక్తిత్వాలను దెబ్బతీయడం సరైన పద్ధతి కాదు అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు నేరుగా అన్వేష్‌ వ్యాఖ్యలకే కౌంటర్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తప్పు చేసినవారిని తప్పు చేసిన చోటే నిలబెట్టి ప్రశ్నించాల్సిందేనని, లేదంటే ఇలాంటి మాటలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయని ఆయన చెప్పిన తీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.

Prajavedhika: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక! జనవరి షెడ్యూల్ విడుదల!

ఈ మొత్తం పరిణామాలు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి. మాటల స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడితే, దానికి ఎదురుగా వచ్చే ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్న వాస్తవం మరోసారి బయటపడింది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఒక వ్యాఖ్య క్షణాల్లో లక్షల మందికి చేరుతుండటంతో, బాధ్యత లేకుండా మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

DG Atul Singh: అవినీతి నిర్మూలనకు ప్రభుత్వపరంగా అనేక చర్యలు.. ఏసీబీ డీజీ అతుల్‌సింగ్!

ఇప్పటికీ ఈ వివాదం పూర్తిగా ముగిసిందని చెప్పలేని పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… సమయం, సందర్భం, వేదిక తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యలు చివరకు మాటల యుద్ధానికే కాకుండా, వ్యక్తిగత ప్రతిష్ఠకే ప్రమాదంగా మారుతున్నాయి. ఈ ఘటన భవిష్యత్తులో  సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Banking Jobs:ఏఐ దెబ్బకు బ్యాంకింగ్‌ రంగం కుదేలు… లక్షల ఉద్యోగాలకు ముప్పు?
Kia Seltos: ఫేస్‌లిఫ్ట్ కాదు.. ఫుల్ మేకోవర్..! నెక్స్ట్-జెన్ కియా సెల్టోస్ రివీల్!
Fruits Benefits: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క పండు తీసుకుంటే చాలు!!

Spotlight

Read More →