టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్, అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'విరోష్' (Vijay Rashmika) త్వరలోనే రియల్ లైఫ్ పార్ట్‌నర్స్ కాబోతున్నారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఈ జంట ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కడం దాదాపు ఖాయమైపోయింది. అసలు వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? ఎలా జరగబోతోంది? అనే ఆసక్తికరమైన వివరాలు మీకోసం..
రష్మిక, విజయ్ పెళ్లి డేట్, వెన్యూ ఇవే..
గీత గోవిందం జంట త్వరలో రియల్ లైఫ్ జంటగా మారబోతున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి బయట ఎక్కడా చెప్పకపోయినా.. పెళ్లి ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ కు ఈ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.
విజయ్, రష్మిక వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లితో ఒక్కటవనున్నారు. వీళ్లు రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లోని ఓ హిస్టారిక్ ప్యాలెస్ ను ఇప్పటికే బుక్ చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లి కూడా సింపుల్‌గానే..
రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ ఎవరికీ తెలియకుండా చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఈ జంట అఫీషియల్ గా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ లాగానే.. పెళ్లి కూడా చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరగనుంది. హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఇస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అక్టోబర్‌లోనే 'సీక్రెట్' ఎంగేజ్‌మెంట్!
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయింది. అక్టోబర్ 3, 2025న (దసరా మరుసటి రోజు) హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో విజయ్, రష్మిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని విజయ్ టీమ్ అప్పట్లో అంతర్గత వర్గాలకు ధృవీకరించింది. ఆ తర్వాత కూడా ఈ జంట పబ్లిగ్గా కనిపించినప్పుడు వారి చేతి వేళ్లకు రింగ్స్ ఉండటంతో అభిమానులు ఇది నిజమేనని ఫిక్స్ అయ్యారు.
రిసెప్షన్ ఎప్పుడు ఉంటుంది?
రాజస్థాన్‌లో పెళ్లి పూర్తయ్యాక, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ స్నేహితుల కోసం భారీ రిసెప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. పెళ్లిని మాత్రం మీడియా హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని ఈ జంట భావిస్తోంది.
సినిమాల్లో తమ నటనతో అలరించిన ఈ క్యూట్ పెయిర్, ఇప్పుడు నిజ జీవితంలో ఒక్కటవ్వడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో జరగబోయే ఈ వెడ్డింగ్ ఖచ్చితంగా ఏడాదిలోనే బిగ్గెస్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ కాబోతోంది.