AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54!

2025-11-07 21:13:00

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 54వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

54. ఓం పరమ సుఖ ప్రదాయై నమః

అర్థం: గుణాతీత స్థితి, దుఃఖస్పర్శ లేని స్థితిని పొందినప్పుడు దానితో   పరమసుఖం, శాంతి అనుభవానికి వస్తాయి. సుఖశాంతులు బాహ్య ప్రపంచంలో వేటివల్లనో దొరికేవి కావు. అవి అంతరంగంలో ఉండేవే.

ఎవరు కామక్రోధాదుల వేగాన్ని అరికట్టగలుగుతారో అతడే యోగి, సుఖవంతుడు అవుతున్నాడని గీతావాక్యం. కామ క్రోధాది అరిషడ్వర్గం (ఆరుగురు శత్రువులు) మనిషి మనస్సులో పెద్ద సంక్షోభం రేకెత్తిస్తుంది. ఆ కల్లోలం గుర్తించటం ఒక ఎత్తు. దానిని అరికట్టటం మరొక ఎత్తు. అరికట్టినప్పుడే చిత్తశాంతి, సుఖం.  

సామాన్యజనులు బయటి విషయాలలోనే సుఖాన్ని పొందగోరుతారు. అది బాహ్యసుఖం. ఉదాహరణకు ఒక కొత్త వస్తువును కొంటాము. దానివల్ల మనకు సుఖం కలుగుతుంది అనుకొంటాము. ఆ వస్తువు పాడై పోతే ఆ సుఖం మరి లేదు. లేదా అది పాతబడిన కొద్దీ దానిపై మోజు తగ్గుతుంది. సుఖభావనా తగ్గుతుంది. కనుక బాహ్యసుఖం తాత్కాలికం; దుఃఖ మిశ్రితం.

వివేకవంతుడు తన ఆలోచనలను అంతర్ముఖంగా మరలిస్తాడు. దృశ్య పదార్థాలు మారేవే, పోయేవే అని తెలుసుకొని, వాటిని ఉపేక్షిస్తాడు. ఆత్మధ్యానంలోనే కాలం గడుపుతాడు. అదే అతని ఆరామ స్థలం. అక్కడే అతడు విహరిస్తూ అనంత శాంతిని, సుఖాన్ని అనుభవిస్తాడు. అది శాశ్వతమైన సుఖం.

అట్టి పరమసుఖాన్ని ప్రసాదిస్తున్న గీతామాతకు ప్రీతితో నమస్కరిస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 53: Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!

నామం 52: Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

నామం 51: Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

నామం 50: Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! 

నామం 49: Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

నామం 48: Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

నామం 47: Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

నామం 46: Bhagavad Gita: శ్రీకృష్ణుని నోటివెంట జాలువారిన గీతామృతం.. మానవునికి మోక్ష మార్గం చూపే జ్ఞానరసాయనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -46!

నామం 45: Bhagavad Gita: అమంగళం శాంతించు గాక... గీతా తత్వం జీవన సత్యంగా మారాలంటే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -45!

నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!

నామం 43 : Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

నామం 42 : Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!

నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!

నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!

నామం 39 : Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!

నామం 38 : Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

నామం 37 : Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!

నామం 35 : Bhagavad Gita : బాహ్య సుఖం తాత్కాలికం ఆత్మసుఖమే నిత్యమైనది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -35!

నామం 34 : Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

నామం 33 : Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

Spotlight

Read More →