PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..!

 దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా

Published : 2025-11-07 20:25:00
జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా..

దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజాస్థలాల్లో కుక్కకాటు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రాంగణాలను పూర్తిగా వీధికుక్కల రహిత ప్రాంతాలుగా మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు ఈ సమస్యపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. డ్రైవ్‌ పురోగతిపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సూచించింది. వీధికుక్కలను పట్టుకున్న తర్వాత వాటిని తిరిగి వదిలివేయకూడదని, వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

ఈ ఏడాది ఆగస్టు 11న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని బెంచ్ కుక్కల దాడులపై సీరియస్‌గా స్పందించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో వీధికుక్కలను షెల్టర్ హోమ్స్‌కే పరిమితం చేయాలని ఆదేశించింది. అయితే, జంతు ప్రేమికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని కొత్త ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజా ప్రాంగణాల్లో, సంస్థాగత ప్రాంతాల్లో కుక్కకాటు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆదేశాలు వెలువరించింది.

Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

అదేవిధంగా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. రోడ్లపై ఉన్న పశువులను పట్టుకుని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని, వాటి సంరక్షణ, ఆహారం, వసతి వంటి అంశాలను ప్రభుత్వం పర్యవేక్షించాలంటూ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!

కుక్కకాట్ల కారణంగా భారతదేశం అంతర్జాతీయంగా ప్రతిష్ట కోల్పోతోందని సుప్రీం విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాయని విమర్శిస్తూ, ఇకపై అలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించింది. ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమని గుర్తుచేసిన కోర్టు, 8 వారాల్లో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్యపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన గడువు విధించింది. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో వీధికుక్కలు, రోడ్లపై తిరిగే పశువుల సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!
Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!
World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!
Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!

Spotlight

Read More →