Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే! Nara Lokesh: పుట్టినరోజున సేవా స్ఫూర్తి చాటుకున్న నారా లోకేష్.. టీటీడీ ట్రస్టుకు భారీ విరాళం! Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం! తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! TTD Updates: శ్రీవారి కొండపై పెరిగిన రద్దీ... తలనీలాలు సమర్పించిన 22 వేల మందికిపైగా భక్తులు! బండ్ల గణేశ్ 'సంకల్ప యాత్ర'.. షాద్‌నగర్ గడప నుంచి శేషాచలం కొండ దాకా.. బాబు కోసం మొక్కు తీర్చుకునే వేళ! SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు! TTD: తిరుమలలో భక్తి జాతర…! హుండీ ఆదాయంలో కొత్త రికార్డు! Tirumala: శ్రీవారి భక్తులకు ఏపీ టూరిజం బంపర్ ఆఫర్... రూ.450తో స్పెషల్ ప్యాకేజీలు, పూర్తి వివరాలివే! Nara Lokesh: పుట్టినరోజున సేవా స్ఫూర్తి చాటుకున్న నారా లోకేష్.. టీటీడీ ట్రస్టుకు భారీ విరాళం! Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం! తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! TTD Updates: శ్రీవారి కొండపై పెరిగిన రద్దీ... తలనీలాలు సమర్పించిన 22 వేల మందికిపైగా భక్తులు! బండ్ల గణేశ్ 'సంకల్ప యాత్ర'.. షాద్‌నగర్ గడప నుంచి శేషాచలం కొండ దాకా.. బాబు కోసం మొక్కు తీర్చుకునే వేళ! SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు! TTD: తిరుమలలో భక్తి జాతర…! హుండీ ఆదాయంలో కొత్త రికార్డు!

TTD: తిరుమలలో భక్తి జాతర…! హుండీ ఆదాయంలో కొత్త రికార్డు!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరల

2026-01-02 10:04:00
Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నోట్ల వర్షం..! తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు..!


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. “గోవిందా.. గోవిందా..” నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే సుమారు 1 లక్షా 77 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో దాదాపు 33 వేల వాహనాలు తిరుమల కొండపైకి చేరుకోవడం భక్తుల రద్దీ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.

AP School: ఏపీలోని ఆ ప్రభుత్వ స్కూల్‌లో గ్రౌండ్ లుక్ అదిరింది..! లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ రేంజ్‌లో..!

భక్తుల సంఖ్య పెరగడంతో హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. డిసెంబర్ 30న రూ. 2.25 కోట్ల హుండీ ఆదాయం నమోదుకాగా, వైకుంఠ ఏకాదశి రోజైన డిసెంబర్ 31న ఏకంగా రూ. 4.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల వేళ కూడా భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఈ ఆదాయం శ్రీవారి సేవలు, అన్నదానం, వసతి సౌకర్యాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Ballari Hightension: బళ్లారిలో హై టెన్షన్... MLA ఇంటిపై కాల్పులు! ఒకరు మృతి!

ఇక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు టీటీడీ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎండలో, రద్దీలో అలసిపోయే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ‘మొబైల్ వాటర్ డిస్పెన్సింగ్’ విధానాన్ని అమలు చేస్తోంది. శ్రీవారి సేవకులు తమ వీపుకు వాటర్ క్యాన్లను ధరించి, గ్లాసుల ద్వారా భక్తులకు తక్షణమే నీరు అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం ముగించుకుని బయటకు వచ్చే భక్తులకు ఈ సేవ ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..!

ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులను కూడా సర్వదర్శనానికి అనుమతిస్తూ టీటీడీ సౌలభ్యాలు కల్పిస్తోంది. ఆక్టోపస్ భవనం, నారాయణగిరి ఉద్యానవనం మీదుగా క్యూలైన్లను క్రమబద్ధీకరించి, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2 ద్వారా దర్శనానికి పంపుతున్నారు. ఇదిలా ఉండగా, చెన్నైకి చెందిన భక్తుడు పొన్నయ నాగేశ్వరన్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఈ విరాళానికి సంబంధించిన డీడీని ఆయన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. భక్తుల విశ్వాసం, భక్తితో తిరుమల మరోసారి భక్తి శిఖరాలను తాకుతోంది.
 

Leopard Alert: భక్తులకు అలర్ట్! చిరుత కలకలం... జాగ్రత్త!
Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!
Health Tips: మెదడు నుంచి గుండె వరకు.. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మ్యాజిక్!
Land Pattas Distribution: ఏపీలో వారందరికీ సంక్రాంతి కానుక! ఇంటి పట్టాలు పంపిణీ... రెడీ గా ఉండండి!
Scam: ప్రధాని మోదీ పేరుతో ఈ-మెయిల్ మోసం…! దిల్లీ వాసిపై సీబీఐ కేసు!
TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు!

Spotlight

Read More →