LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Sports

RCB Fans GoodNews: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఐదు హోమ్ మ్యాచ్‌లు అక్కడే.!

RCB Fans GoodNews: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త.

AndhraPravasi News Desk 1 min read
RCB Fans GoodNews: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఐదు హోమ్ మ్యాచ్‌లు అక్కడే.!
  • చిన్నస్వామిలో 5.. రాయ్‌పూర్‌లో 2: ఆర్‌సీబీ హోమ్ మ్యాచ్‌ల వేదికలపై స్పష్టత..
     
  • కర్ణాటక సర్కార్ పచ్చజెండా: చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణపై ఉత్కంఠకు తెర..

RCB Fans GoodNews: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకు వేదికైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తిరిగి అడుగుపెట్టనుంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్సీబీ తన ఐదు హోమ్ మ్యాచ్‌లను సొంతగడ్డపైనే ఆడనుంది.

గత ఏడాది ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. నిర్వహణ లోపం వల్ల జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణ చేపట్టిన అధికారులు స్టేడియంలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. దీంతో ఆర్సీబీ మరో వేదికను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం భద్రతా చర్యలు మెరుగుపరచడం, ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే, ఆర్సీబీ ఆడాల్సిన మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

ఈ విషయమై ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. "చిన్నస్వామి స్టేడియం కేవలం మా హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు, మా జట్టు అస్తిత్వం. ఇక్కడి అభిమానుల కేరింతలు ఆటగాళ్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మా అభిమానులు సొంతగడ్డపై మ్యాచ్‌లు చూసేందుకు అర్హులు" అని ఆయన పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Be the first to react

More Coverage

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు త…