LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Sports

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్!

టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంకపై 6 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకోగా, పాక్ ఇంటిదారి పట్టింది..

AndhraPravasi News Desk 2 min read
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ, నెట్ రన్ రేట్ సమీకరణాల్లో వెనుకబడటంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ విజయంతో పని లేకుండానే, మెరుగైన రన్ రేట్ ఉన్న న్యూజిలాండ్ జట్టు సెమీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. షాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ శ్రీలంక బౌలర్లను ఆడుకున్నారు. ముఖ్యంగా ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదడంతో పాక్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 176 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు. ఒక దశలో పాకిస్తాన్ 250 పరుగులు దాటుతుందనిపించింది. కానీ, ఫఖర్ జమాన్ అవుటైన తర్వాత లంక బౌలర్లు పుంజుకోవడంతో, పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

పాకిస్తాన్ సెమీస్‌కు వెళ్లాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, యువ ఆటగాడు పవన్ రత్నాయకే అద్భుత పోరాటం చేశాడు. కేవలం 37 బంతుల్లోనే 58 పరుగులు చేసి పాకిస్తాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. రత్నాయకే ఇన్నింగ్స్ వల్ల లంక స్కోరు 150 దాటడంతో, పాకిస్తాన్ గెలిచినా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అప్పుడే తేలిపోయింది.

చివర్లో కెప్టెన్ దాసున్ శనక ఊచకోత కోశాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి శ్రీలంకను దాదాపు గెలిపించినంత పని చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో శ్రీలంక 20 ఓవర్లలో 207/6 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ను దాటలేకపోయింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో పాటు  న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్తాన్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రాణించినా, బౌలింగ్‌లో శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేయలేకపోవడం ఆ జట్టు కొంపముంచింది. మరోవైపు ఈ టోర్నీలో శ్రీలంక ప్రయాణం కూడా ముగిసింది.

Be the first to react

More Coverage

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు త…