Scams: రివార్డు పాయింట్ల పేరిట ఫోన్ హ్యాక్..! ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ..!

BOI పేరుతో APK వైరస్ దాడి.. వాట్సాప్ నుంచే బ్యాంక్ ఖాతాల దోపిడీ..‘రివార్డ్స్’ మాయలో పడితే అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రాప్..తెలియని మెసేజ్‌పై క్లిక్ చ

2026-01-20 17:45:00
అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ-బ్రిటిష్ ప్రతినిధి కీలక భేటీ!

BOI పేరుతో APK వైరస్ దాడి.. వాట్సాప్ నుంచే బ్యాంక్ ఖాతాల దోపిడీ..

Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! అమలాపురానికి మరో దారి.. ట్రాఫిక్ జామ్‌లకు ఎండ్ కార్డు..!

‘రివార్డ్స్’ మాయలో పడితే అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రాప్..

AP Government: చింతూరు ప్రజల చిరకాల స్వప్నం... రూ. 3.44 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం!

తెలియని మెసేజ్‌పై క్లిక్ చేస్తే డబ్బులన్నీ మాయం.. పోలీసుల హెచ్చరిక..

గ్రీన్లాండ్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఆర్కిటిక్‌లో పెరిగిన సైనిక ఉత్కంఠ!

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిని కనిపెట్టి, అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో జరుగుతున్న మోసాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ‘బ్యాంక్ రివార్డు పాయింట్లు’ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) పేరుతో సందేశాలు పంపుతూ, మీకు రూ.9,999 విలువైన రివార్డు పాయింట్లు ఉన్నాయని, అవి గడువు ముగియబోతున్నాయని నమ్మబలుకుతున్నారు. వెంటనే ఒక యాప్ డౌన్‌లోడ్ చేసి క్లెయిమ్ చేసుకోవాలని చెప్పుతూ ప్రజలను ఉచ్చులోకి లాగుతున్నారు.

Flyover: రూ.300 కోట్లతో భారీ ప్రాజెక్టు..! మూడో వంతెనతో మారనున్న నగర రూపం!

ఈ మోసంలో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, మెసేజ్‌తో పాటు ‘BOI Mobile.apk’ అనే ఏపీకే (APK) వైరస్ ఫైల్‌ను పంపిస్తున్నారు. ఇది అసలైన బ్యాంక్ యాప్ కాదని, పూర్తిగా మాల్వేర్ అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఈ ఫైల్‌ను క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే, ఫోన్ మొత్తం హ్యాక్ అవుతుంది. ఫోన్‌లో ఉన్న బ్యాంక్ యాప్‌లు, యూపీఐ, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఫలితంగా క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు ఖాళీ అవుతుంది. ఇది నిజంగా బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ అనుకుని లింక్‌పై క్లిక్ చేయడమే బాధితులకు పెద్ద ప్రమాదంగా మారుతోంది.

దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర!

గతంలో కూడా ఇదే తరహా మోసాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో జరిగాయి. అప్పట్లో కూడా ఏపీకే వైరస్ ఫైళ్ల ద్వారా వందలాది మంది డబ్బులు కోల్పోయారు. ఇప్పుడు అదే స్కామ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో మళ్లీ మొదలైంది. ఈ వైరస్ ఫైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే, ఆ నంబర్ పేరు ఆటోమేటిక్‌గా ‘BOI’గా మారిపోతుంది. అంతేకాదు, ఆ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్స్‌కి, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులందరికీ కూడా అదే మెసేజ్, అదే ఏపీకే ఫైల్ ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ గ్రూప్ పేరు కూడా మారిపోతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విధంగా ఒకరి ఫోన్ నుంచి వందల మందికి ఈ మోసం వ్యాపించడం అత్యంత ప్రమాదకర పరిస్థితిగా మారుతోంది.

Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు!

ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకులు లేదా బీమా సంస్థలు ఎప్పుడూ వాట్సాప్‌లో రివార్డు పాయింట్ల పేరుతో ఏపీకే ఫైళ్లు పంపవని స్పష్టం చేస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి మెసేజ్‌లను అసలు నమ్మకూడదు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. ఒకవేళ పొరపాటున ఈ ఫైల్‌ను క్లిక్ చేస్తే వెంటనే బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించుకోవాలి. ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం, ఈ-మెయిల్, యూపీఐ పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం తప్పనిసరి. డబ్బులు పోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి లేదా దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

చికెన్ స్కిన్‌తో తింటే మంచిదా? కాదా? ఆరోగ్యం మరియు రుచి వెనుక అసలు నిజాలు ఇవే! తినేముందు తప్పక తెలుసుకోండి..
రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
Banking News: ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలు.. లావాదేవీలపై పెరిగిన ఛార్జీలు..!!

Spotlight

Read More →