దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లపై వరుసగా కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ, ఇప్పుడు IMPS లావాదేవీల విషయంలోనూ (SBI New Rules) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మార్పులు ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ఎక్కువగా ఉపయోగించే ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి. బ్యాంక్ ప్రకటించిన తాజా నిర్ణయాల ప్రకారం ఫిబ్రవరి 15, 2026 నుంచి ఈ కొత్త IMPS ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
ఎస్‌బీఐ స్పష్టంగా (SBI Transaction Charges) తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ ఛానెల్స్ ద్వారా చేసే IMPS లావాదేవీల్లో రూ.25,000 వరకు ఎలాంటి రుసుములు ఉండవు. అయితే ఒకసారి రూ.25,000 దాటితే మాత్రం ఆ మొత్తానికి అనుగుణంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే చిన్న మొత్తాల బదిలీలకు ఇప్పటిలాగే ఊరట ఉన్నా, పెద్ద మొత్తాలు పంపే వారికి అదనపు భారం పడనుంది. అయితే బ్రాంచ్ నుంచి బ్రాంచ్‌కు చేసే IMPS బదిలీల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అవి ఇప్పటివరకు ఉన్న ఛార్జీలతోనే కొనసాగుతాయి.
ఇదిలా ఉండగా, కొన్ని ప్రత్యేక ఖాతాదారులకు మాత్రం ఈ IMPS ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. DSP, PMSP, ICSP, CGSP, PSP, RSP వంటి జీత ప్యాకేజీ ఖాతాలు, శౌర్య కుటుంబ పెన్షన్ ఖాతాలు, అలాగే SBI రిష్టే కుటుంబ సేవింగ్స్ ఖాతాదారులకు కొత్త రుసుములు వర్తించవు. ఈ ఖాతాలు ఉన్న వినియోగదారులు యథావిధిగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా IMPS సేవలను ఉపయోగించుకోవచ్చు.
IMPS కంటే ముందే ఎస్‌బీఐ (SBI ATM Charges) డిసెంబర్ 1, 2025 నుంచే ఏటీఎం మరియు ADWM లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమలు చేసింది. సేవింగ్స్ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత పరిమితిని మించి నగదు ఉపసంహరణ చేస్తే ప్రతి లావాదేవీకి రూ.23తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. గతంలో సాలరీ అకౌంట్లకు అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉండగా, ఇప్పుడు వాటిని నెలకు 10 ఉచిత లావాదేవీలకే పరిమితం చేశారు. దీంతో సాలరీ ఖాతాదారులు కూడా ఇకపై జాగ్రత్తగా లావాదేవీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరెంట్ అకౌంట్ల విషయంలోనూ ప్రతి లావాదేవీపై పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు మాత్రం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వీరు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఎంతసార్లు నగదు తీసుకున్నా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అంతేకాదు, కార్డు లేకుండా నగదు ఉపసంహరణ సేవను కూడా ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగానే కొనసాగిస్తోంది.
ఎస్‌బీఐ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు (Latest SBI Updates) డిజిటల్ లావాదేవీల వినియోగాన్ని నియంత్రించే దిశగా ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న మొత్తాల లావాదేవీలకు ఊరట ఇచ్చినా, పెద్ద మొత్తాల బదిలీలపై ఛార్జీలు పెరగడం వల్ల ఖాతాదారులు తమ లావాదేవీలను మరింత ప్రణాళికతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. (Banking News India) బ్యాంక్ కొత్త రూల్స్ నేపథ్యంలో వినియోగదారులు తమ ఖాతా రకం, ఉచిత పరిమితులు, వర్తించే ఛార్జీలపై అవగాహన పెంచుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.