Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..! సిలిండర్ కావాలంటే ఇది తప్పనిసరి.. జనవరి 31 డెడ్‌లైన్! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..! సిలిండర్ కావాలంటే ఇది తప్పనిసరి.. జనవరి 31 డెడ్‌లైన్! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు!

Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు!

 భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియాకు చెందిన కాక్‌పిట్ సిబ్బందిపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) తీవ్ర చర్యలకు దిగింది. ఢిల్లీ–టోక్యో మధ్య నడిచ

2026-01-01 13:45:00
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!

భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియాకు చెందిన కాక్‌పిట్ సిబ్బందిపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) తీవ్ర చర్యలకు దిగింది. ఢిల్లీ–టోక్యో మధ్య నడిచిన అంతర్జాతీయ విమానాల్లో కీలక భద్రతా లోపాలు, నిబంధనల అతిక్రమణలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా విమానాలను నడిపినందుకు గాను షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని సంబంధిత పైలట్లను డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..

ముఖ్యంగా ఢిల్లీ నుంచి టోక్యోకు వెళ్లిన AI-357, అలాగే తిరుగు ప్రయాణంలో టోక్యో నుంచి ఢిల్లీ వచ్చిన AI-358 విమానాల నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు డీజీసీఏ గుర్తించింది. ఈ విమానాలు ‘మినిమమ్ ఎక్విప్‌మెంట్ లిస్ట్’ (MEL) నిబంధనలకు అనుగుణంగా లేనప్పటికీ ఆ లోపాలను పట్టించుకోకుండా ఆపరేట్ చేసినట్లు విచారణలో తేలింది. MEL నిబంధనలు అంటే విమానం ఎగరడానికి తప్పనిసరిగా సక్రమంగా ఉండాల్సిన పరికరాల జాబితా. వాటిని విస్మరించడం అంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని డీజీసీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..

ఇది ఒక్కసారి జరిగిన తప్పిదం కాదని, గతంలోనూ ఇతర సెక్టార్లలో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం బాధ్యులైన పైలట్లపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో వివరించాలని ప్రశ్నించింది. విమాన భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ ఘటన ఎయిర్ ఇండియా భద్రతా వ్యవస్థలపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!

ఇదిలా ఉండగా, గత నెలలో ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AIC 887) ఇంజిన్ సమస్యతో తిరిగి ఢిల్లీకి రావాల్సి వచ్చిన ఘటనపైనా డీజీసీఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండో ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోవడంతో పైలట్లు అప్రమత్తమై ఆ ఇంజిన్‌ను షట్‌డౌన్ చేసి సురక్షితంగా ల్యాండ్ చేశారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంపై డీజీసీఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అన్ని ఘటనలపై డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ సేఫ్టీ పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!
ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!
ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!
RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్!
Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!
Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక!

Spotlight

Read More →