Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..! సిలిండర్ కావాలంటే ఇది తప్పనిసరి.. జనవరి 31 డెడ్‌లైన్! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..! సిలిండర్ కావాలంటే ఇది తప్పనిసరి.. జనవరి 31 డెడ్‌లైన్! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు!

Oil & Gas: చమురు తవ్వకాలపై ఏపీ షరతులు…! ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్షోర్ చమురు–వాయు తవ్వకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌కు సంబంధించి వేదాంత లిమి

2025-12-26 12:43:00
Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్షోర్ చమురు–వాయు తవ్వకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌కు సంబంధించి వేదాంత లిమిటెడ్ (కెయిర్న్ ఆయిల్ & గ్యాస్ డివిజన్) సంస్థకు షరతులతో కూడిన ఎన్‌వోసీ (No Objection Certificate) మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ (DSF) పాలసీ–2018 కింద ఇప్పటికే వేదాంతకు అనుమతులు లభించగా, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 35 ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు అనుమతి ఇవ్వాలని వేదాంత దరఖాస్తు చేయగా, ప్రభుత్వ పరిశీలన అనంతరం 20 చోట్ల మాత్రమే డ్రిల్లింగ్‌కు అనుమతి ఇచ్చారు.

Dhurandhar: వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ధురంధర్.. బాలీవుడ్‌కు మరో బ్లాక్‌బస్టర్!

ప్రతిపాదిత ఆయిల్ & గ్యాస్ బ్లాక్ మధ్యగా బందరు కాలువ, అలాగే కృష్ణా డెల్టా సిస్టమ్ (KDS) కాలువల నెట్‌వర్క్ ఉండటంతో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. నీటిపారుదల వ్యవస్థలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో, వేదాంత ప్రతిపాదనను సాంకేతికంగా పరిశీలించిన తర్వాతే పరిమిత స్థాయిలో ఎన్‌వోసీ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడలోని ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ – కృష్ణా డెల్టా సిస్టమ్, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్లకు అవసరమైన పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్?

ప్రభుత్వం జారీ చేసిన ఈ ఎన్‌వోసీ కేవలం నీటిపారుదల శాఖ పరిధికే పరిమితం అని స్పష్టం చేసింది. డ్రిల్లింగ్ సమయంలో బందరు కాలువ, కేడీఎస్ కాలువలు, డ్రైనేజీ నెట్‌వర్క్, చెరువులు, రిజర్వాయర్ల నుంచి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు అనే కీలక షరతు విధించింది. అంతేకాదు, బావుల తవ్వకాల వల్ల సాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించకూడదని, కాలువల నిర్మాణ భద్రతకు ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!!

వేదాంత సంస్థ డ్రిల్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించే ముందు పర్యావరణ, అటవీ, కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాతే ఆయిల్ & గ్యాస్ బావుల తవ్వకం మొదలవుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశీయ చమురు ఉత్పత్తి పెరిగి, ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, స్థానిక ప్రజల ప్రయోజనాలు, నీటి వనరుల భద్రత, పర్యావరణ పరిరక్షణ అంశాలు కచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై నీటిపారుదల శాఖతో పాటు జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
 

TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే?
108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం!
Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!!
22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు!
Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..!

Spotlight

Read More →