OPPO కంపెనీ తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ Find N6 ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ప్రస్తుతం భారతదేశంలో పరీక్షలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇతర ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే ఇది ఇంకా పలుచగా, తేలికగా ఉండబోతోందని లీకులు చెప్తున్నాయి.
ఈ ఫోన్‌లో కొత్తతరం శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉండనుంది. ఈ ప్రాసెసర్‌తో వచ్చే ప్రపంచంలో తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావొచ్చని భావిస్తున్నారు. ఫోన్‌లో 8.1 అంగుళాల పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్, 6.6 అంగుళాల బయట స్క్రీన్ ఉంటుందని లీకులు వెల్లడించాయి.
కెమెరా విషయంలో ఈ ఫోన్ చాలా బలంగా ఉండనుంది. ఇందులో 50 MP Sony ప్రధాన కెమెరా, అలాగే 3X జూమ్ పిరిస్కోప్ లెన్స్ ఉండొచ్చు. దీంతో తక్కువ వెలుతురు ఉన్నా మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చని అంచనా. బ్యాటరీ విషయంలో కూడా ఈ ఫోన్ ప్రత్యేకమైందే. ఇందులో 6000 mAh కంటే ఎక్కువ బ్యాటరీ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు.
సాఫ్ట్‌వేర్‌గా ఈ ఫోన్‌లో తాజా ఆండ్రాయిడ్ ఆధారంగా OPPO కొత్త UI ఉంటుంది. ఫోల్డబుల్ స్క్రీన్‌కు అనుగుణంగా స్ప్లిట్ స్క్రీన్, మల్టీటాస్కింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందించనుంది. మొత్తం మీద—డిజైన్, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్… OPPO ఈసారి పవర్‌ఫుల్ ఫోల్డబుల్‌ను తీసుకువస్తోంది.
ధర విషయానికి వస్తే, భారతదేశంలో ఇది ₹1,25,000 నుండి ₹1,50,000 మధ్య ఉండవచ్చని అంచనా. ఫోన్ 2026 తొలినాళ్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లకు బలమైన పోటీదారుగా నిలవొచ్చు.