రాష్ట్రంలోనే మొట్ట మొదటి మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంగళగిరిలో ప్రారంభించిన విద్యా మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ మంగళగిరి లో ఈ మోడల్ పబ్లిక్ లైబ్రరీని అభివృద్ధి చేయటానికి APTS కార్పొరేషన్ ఆర్ధికంగా సహకారం అందించటం చాలా సంతోషంగా ఉందని మన్నవ మోహన కృష్ణ గారు అన్నారు.
నారా లోకేష్ గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోందన్నారు. విద్య, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించటంలో APTS ఎప్పుడూ ముందుంటుందని మోహన కృష్ణ గారు అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్రంలో టెక్నాలజీని మరింత విస్తృత పరిచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే విధంగా APTS పని చేస్తుంది అన్నారు.
మంగళగిరిలో మోడల్ పబ్లిక్ లైబ్రరీ అభివృద్ధిలో APTS భాగస్వామ్యం కావటానికి అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు ధన్యవాదాలు తెలిపారు.