రిటైల్ మార్కెట్‌లో డీమార్ట్ విశేష ఆదరణ పొందింది. మధ్యతరగతి కుటుంబాలకు డీమార్ట్ కిరాణ దుకాణంగా మారింది. సరసమైన ధరలకు వస్తు ఉత్పత్తులు వస్తుంటాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మరింత తక్కువ డబ్బుకు వస్తువులు పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంది.
డీమార్ట్ షాపింగ్‌లో చిట్కాలు పాటిస్తే అధిక ప్రయోజనం పొందుతారు. పండుగల సమయంలో డీమార్ట్‌లో షాపింగ్ చేయాలి. ఈ సమయంలో వస్తువులు, ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తుంటారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం.. భారీ తగ్గింపు వంటివి ఉంటుంటాయి.
ఈ సమయంలో షాపింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు పొందవచ్చు. ఇప్పుడు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలు వస్తుండడంతో ఈ సమయంలో షాపింగ్ చేయాలి. కిరాణ సామగ్రి నుంచి బట్టలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లు చూసి కొనుగోలు చేయాలి.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందడానికి వినియోగదారులు అక్కడి బోర్డులు, ధరలు స్పష్టంగా చదివి తీసుకోవాలి. ధరలు, లేబుళ్లపై అంటించిన స్టిక్కర్లు చూడకుండా వెళ్లిపోతుంటారు. వాటిని సక్రమంగా చదివితే ఆఫర్ ఏమిటో అర్థమవుతుంది.
ఆఫర్లు ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు. డీమార్ట్ షాపింగ్ అంటే సాధారణంగా ఒక గంట అయినా కేటాయించాలి. హడావుడిగా షాపింగ్ చేస్తే ఆఫర్లు, డిస్కౌంట్లు లేకుండా వస్తువులు పొందుతారు. లోపలకు వెళ్లగానే తీరికగా.. తాపీగా మాల్ మొత్తం ఒకసారి తిరిగిరావాలి.
అప్పుడే ఎక్కడ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయో తెలుస్తాయి. వాటిని చూసి సెలక్టెడ్‌గా షాపింగ్ చేయడం సులవు. వస్తువులు ఏ కావాలో అనే ఒక స్పష్టతతోపాటు ఏ వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయనే అవగాహన వస్తుంది.
డీమార్ట్‌లో వారాంతాలు అంటే శని, ఆదివారాలతోపాటు నెల ప్రారంభం అంటే దాదాపు ప్రతినెల పదో తేదీలోపు డీమార్ట్‌కు వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే జీతాలు పడడంతో అందరూ నెలవారీ సరుకులు కొనేందుకు డీమార్ట్‌కు వస్తుండడంతో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఆఫర్లు, డిస్కౌంట్లు చూడకుండా వస్తువులు కొనుగోలు చేస్తారు.