వైసీపీ మాజీ సర్పంచ్ భూదందా.. నకిలీ పత్రాలతో లీజు డ్రామా.. మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో భూదందా..
పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన పిన్నెబోయిన రాంబాబు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామ శివారులోని సర్వే నంబర్ 230/1 లో తమ కుటుంబానికి 2.30 ఎకరాల పట్టా భూమి ఉంది.
- రికార్డులు తారుమారు చేసి పట్టా భూమి కబ్జా చేసిన వైసీపీ నాయకుడిపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..
- Politics: వృద్ధురాలి ఇంటి స్థలాన్ని నొక్కేసిన వైసీపీ నేతలు.. న్యాయం చేయాలంటూ వినతి..
పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన పిన్నెబోయిన రాంబాబు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామ శివారులోని సర్వే నంబర్ 230/1 లో తమ కుటుంబానికి 2.30 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమిపై పిన్నెబోయిన రామకృష్ణ అనే వైసీపీ నాయకుడు కన్నువేశాడు. అతను గత ప్రభుత్వంలో అధికార బలంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్లో తన పేరు నమోదు చేయించుకుని, ఆ భూమిని వేరొకరికి అక్రమంగా విక్రయించాడు.
కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, వెల్దుర్తి తహశీల్దార్ గారు ఆన్లైన్ రికార్డుల నుండి అక్రమంగా చేరిన పేరును తొలగించి, తిరిగి తమ భూమిని తమకు కేటాయించడం లేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం కంచెరు గ్రామానికి చెందిన శీరపు రమేష్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నెంబర్ 196-1 లో తమ నాయనమ్మ అయిన శీరపు అప్పయ్యమ్మ పేరు మీద 94 సెంట్ల భూమి ఉంది. అయితే, స్థానిక వైసీపీ మాజీ ప్రెసిడెంట్ శీరపు గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ బలంతో ఈ భూమిపై కన్నువేశాడు. తమ తల్లి శీరపు రమణమ్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న గురునాథ్ రెడ్డి.. సదరు భూమిని తనకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చినట్లు కొన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆ నకిలీ ఆధారాలను చూపిస్తూ ప్రస్తుతం ఆ పొలం తనదేనంటూ అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఈ మోసాన్ని గమనించి తమ భూమిని తమకు ఇచ్చేయాలని కోరినందుకు తనతో పాటు అతని కుటుంబాన్ని సదరు వైసీపీ నాయకుడు రకరకాలుగా వేధిస్తూ, తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాడు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన బిళ్ళగండ్ల రామక్రిష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గతంలో 'నిర్మలా సొసైటీ' అనే క్రిస్టియన్ మత సంస్థ పేరిట మాజీ ఎంపీ పి. ఆంథోని రెడ్డి, అతని వారసులు ఎలాంటి విలువ చెల్లించకుండా ఉచితంగా దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని పొందారు. అందులో కేవలం 5 ఎకరాలలో మాత్రమే స్కూల్ నిర్మించి, మిగిలిన 55 ఎకరాల భూమిలో గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ లబ్ధి పొందుతున్నారు. ఈ భూమి ద్వారా దాదాపు రూ. 30 కోట్ల మేర వ్యాపార లబ్ధి పొందడమే కాకుండా ఇందులో ఒక్క సెంటు భూమి కూడా వారి స్వంత పట్టా భూమి కాదు.
మత సంస్థ పేరిట ఉచితంగా పొందిన ఈ విలువైన ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా, బెంగళూరుకు చెందిన హైదర్వలి అనే వ్యక్తికి చెందిన 'బి.యస్. ఇంటర్నేషనల్ స్కూల్' సంస్థకు రూ. 15 కోట్ల భారీ మొత్తానికి అక్రమంగా బదిలీ చేశారు. ఒక మతం పేరుతో భూమిని పొంది, ఇప్పుడు వేరొకరికి దీనిని రూ. 15 కోట్లకు మార్పిడి చేయడం పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనే. ఈ భారీ భూకుంభకోణం, నిబంధనల ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్, డి.ఆర్.ఓ, స్థానిక తహశీల్దార్ లకు పలుమార్లు ఆధారాలతో సహా అర్జీలు ఇచ్చినా, వార్తలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరాడు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగు రోడ్ల గ్రామానికి చెందిన టి. సుబ్బమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గత ఏడు సంవత్సరాలుగా సరమట్లపల్లికి చెందిన వైసీపీ నాయకులు మల్లికార్జున రెడ్డి, జ్ఞాన్ రెడ్డి, రమణ రెడ్డి, జబర్ సాబ్, సురేష్ రెడ్డిలు కలిసి తన ప్రయోజనార్థం ఉన్న 5 సెంట్ల ఇంటి భూమిని అక్రమంగా కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా సదరు స్థలంలో దుకాణం కూడా నిర్మించారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన ఎమ్. బుజ్జి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గత 2008వ సంవత్సరంలో ప్రభుత్వం పేదలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు తమ గ్రామంలోని సర్వే నెంబర్ 874 లో 1 ఎకరం 19 సెంట్ల భూమిని సేకరించింది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన 42 మంది అర్హులైన లబ్ధిదారులకు ప్లాట్లు కూడా కేటాయించారు. అయితే గత 2020వ సంవత్సరంలో అప్పటి వైసీపీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కుంపటి నాగేంద్రబాబు తన సహచరులైన గుడ్డవల్లి బసవయ్య, గుడ్డవల్లి ఏడుకొండలు, గుడ్డవల్లి నాగరాజు, గోరిపర్తి రామచంద్రరావు, చావలి కృష్ణ కిషోర్ లతో కలిసి నేరపూరిత కుట్రకు తెరలేపారు. మొవ్వ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో 27/07/2020 తేదీన ఒక తప్పుడు భాగపత్ర దస్తావేజును సృష్టించి, ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలోని 10 సెంట్ల స్థలాన్ని తమ ప్రైవేట్ ఆస్తిగా చూపిస్తూ అక్రమంగా ఆక్రమించుకున్నారు.
ఈ అక్రమ రిజిస్ట్రేషన్, ఆక్రమణపై తాము ఫిర్యాదు చేయడంతో తహశీల్దార్ గారు సదరు భూమిని సర్వే చేసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, కుంపటి నాగేంద్రబాబు తమ రాజకీయ బలంతో రెవెన్యూ సిబ్బందిని బెదిరించి, విధులకు ఆటంకం కలిగిస్తూ పలుమార్లు సర్వేను అడ్డుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలకు ఘంటసాల మండల రెవెన్యూ సిబ్బంది కూడా లోపాయికారీగా సహకరించి, ఆ భూమిని నిషేధిత జాబితా (22A)లో పెట్టకుండా ప్రైవేట్ రిజిస్ట్రేషన్కు మార్గం సుగమం చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ న్యాయం చేయాలని కోరాడు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన కె. శ్రీనివాస్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నంబర్ 126-2 లో 1.60 ఎకరాలు, అలాగే సర్వే నంబర్ 186-3 లో 5.00 ఎకరాల భూమి తనకు ఉంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై వెబ్ల్యాండ్ రికార్డులలో తన భూమిని కేవలం 0.68 సెంట్లు మాత్రమే చూపిస్తూ, మిగిలిన భూమిని రికార్డుల నుండి తొలగించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యరవపల్లి గ్రామానికి చెందిన బి. హనుమంతు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..రాంపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 237-9 లో గల 1.25 ఎకరాల భూమిని 1970 జూన్ 27వ తేదీన తమ తాతగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అసలు పత్రాలు కూడా ప్రస్తుతం తమ వద్ద భద్రంగా ఉన్నాయి.
అయితే, పెనుకొండ మండల రెవెన్యూ అధికారులు రికార్డులను కంప్యూటరైజ్ చేసే సమయంలో చేసిన పొరపాటు వల్ల, ఈ పట్టా భూమిని కాస్తా ప్రభుత్వ భూమిగా రికార్డులలో మార్చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పోగులపల్లె గ్రామానికి చెందిన గురవయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..నందిమండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1083/c లో ఉన్న చుక్కల భూమిని (సుమారు 2.00 ఎకరాలు) తమ పూర్వీకులైన మునగంరాజు తదితరుల నుంచి వారసత్వంగా సంక్రమించగా, 1966-67, 1990-91 కాలంలో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాం. ఈ భూమికి సంబంధించి 1983 నాటి డి-ఫారం పట్టా, 2001 నాటి పట్టాదారు పాస్ బుక్ కూడా తమ వద్ద ఉన్నాయి. అయితే ఈ భూమిని డి. శ్రీనివాసులు అనే వ్యక్తితో పాటు మరికొందరు కలిసి అక్రమంగా ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా, ఆ భూమిలో అక్రమంగా నిమ్మచెట్లు నాటి, అసలు యజమానులైన తమకు దక్కకుండా చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందిన పోలినాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 65-1 లో తనకు 1.75 ఎకరాల భూమి ఉంది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ-సర్వే నిర్వహించి ఆ భూమిని తనకు అప్పగించాల్సిందిగా కోరాను. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ భూమిని ప్రస్తుతం కొందరు వ్యక్తుల పేరు మీద రికార్డు చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులను విన్నవించిన న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొటాండ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్ 51/10 లో తమకు వంశపారంపర్యంగా వచ్చిన 2.64 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మామిడి తోటతో పాటు ఒక బావి కూడా ఉన్నాయి. దీనిపై గతంలో పట్టాదారు పాస్ పుస్తకం కూడా జారీ అయింది. ఈ భూమి ఆధారంగానే గత 1996వ సంవత్సరంలో ఒక సొసైటీ ద్వారా రూ. 20,000 వ్యవసాయ రుణం తీసుకోగా, అది 2008లో ప్రభుత్వ రుణమాఫీ కింద మాఫీ అయింది.
అంతేకాకుండా, గత 2022వ సంవత్సరంలో అప్పటి తహశీల్దార్ గారు స్వయంగా పొలాన్ని పరిశీలించి, భూమి వీరి ఆధీనంలోనే ఉన్నట్లు సర్టిఫికెట్' కూడా ఇచ్చారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న ఈ భూమిని, తమ పక్క గ్రామమైన చిన్నారెడ్డిపల్లికి చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి కన్నువేశాడు. స్థానిక పోలీసుల సహకారంతో తన భూమిలోకి చొరబడి, గతంలో పునాదులు వేసుకున్న స్థలంలో బలవంతంగా ఒక బిల్డింగ్ నిర్మించి, దౌర్జన్యంగా నివాసం ఉంటున్నాడు. తమ భూమిని ఆక్రమించవద్దని అడ్డుకోగా... సదరు ఆక్రమణదారుడు తనకున్న రాజకీయ, పోలీసు బలంతో తమపైనే తప్పుడు కేసులు పెట్టించి, అరెస్ట్ చేయించి జైలుకు పంపించాడు. ఆ తప్పుడు కేసులు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామానికి చెందిన సుబ్బమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..24 ఏప్రిల్, 2024న తన అన్న అయిన పెద్ద వెంకట కృష్ణయ్య దగ్గర సర్వే నంబర్ 332 పరిధిలోని 0.49 సెంట్ల భూమిని కొనుగోలు చేశాను. అయితే, ఆ తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి సదరు భూమిని సర్వే చేయగా, అది ప్రైవేట్ భూమి కాదని, దేవాలయ భూమి అని తేల్చారు. దీంతో తను ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని అడగగా, ఎదుటి పక్షం వారు తనపై తీవ్రంగా దౌర్జన్యం చేసి, భౌతిక దాడికి పాల్పడ్డారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react