Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష!

మహిళా సాధికారతే లక్ష్యం.. రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలు.. సెర్ప్ పనితీరుపై మంత్రి సమీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) సంస్థ పని తీరుపై ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీని

Published : 2025-11-21 14:22:00
Weekend OTT: ఓటీటీలో వీకెండ్ ట్రీట్.. ఓటీటీకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు! మిస్సవ్వకండి...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) సంస్థ పని తీరుపై ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతం, బ్యాంకు రుణాలు మరియు రైతు ఉత్పత్తి సంస్థల (FPOs) అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించారు.

G20 Summit 2025: భారత్‌కు కీలక మలుపు… జీ20 సమ్మిట్‌ 2025లో గ్లోబల్ సౌత్‌ స్వరం ప్రభలుతుందా?

మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం బ్యాంకుల ద్వారా రుణాలను భారీగా మంజూరు చేయడంపై మంత్రి సమీక్షించారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు (సమావేశం నాటికి) రూ.16,846 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేయడం జరిగింది.

ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!

మార్చి 2026 లోగా మొత్తం రూ.32,322 కోట్ల రూపాయల రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.

UK immigration: యూకే విధానంలో చారిత్రక మార్పులు..! భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొత్త నియమాలు!

సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతం అవుతుంది. ఈ రుణాలు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి, చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి దోహదపడతాయి. ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం.

టీటీడీ తాజా సమాచారం! తిరుమలలో సర్వదర్శనం టైమింగ్స్!

మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా కాకుండా, పూర్తి స్థాయి వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చడంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.

Rural elections : వచ్చే నెల గ్రామీణ ఎన్నికలు.. అధికారిక ప్రకటన త్వరలో.. మూడువిడతల్లో పంచాయతీ ఎన్నికలు!

2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘ సభ్యులను మహిళా వ్యవస్థాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అంశంపై, అలాగే కొత్త సంస్థల ఏర్పాటుపై సమీక్ష జరిగింది.

Cyclone: బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. 48 గంటల్లో తుఫానుగా మారే సూచనలు!

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.578.08 కోట్లతో, 39,371 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులను వ్యాపార సేవా, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..

మిగిలిన లక్ష్యాలను వచ్చే ఏడాది మార్చిలోగా తప్పనిసరిగా సాధించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెర్ప్ తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది.

Bitcoin: బిట్‌కాయిన్‌ వాడకం ఆ రెండు దేశాల్లో విపరీతంగా పెరుగుదల… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్న డిజిటల్‌ కరెన్సీ!!

హైఫర్ ఇంటర్నేషనల్, వాసన్, కాల్గుడి, బ్రెడ్స్ వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల భాగస్వామ్యంతో వంద రైతు ఉత్పత్తి సంస్థలను (FPOs) బలోపేతం చేసే అంశంపై చర్చించారు. వ్యవసాయంలో మెరుగైన ఫలితాల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటుపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

TTD: అవినీతి ఆరోపణలతో దుమారం రేపిన టీటీడీ కొనుగోళ్లు…! బోర్డు ఇప్పుడు ఫుల్ క్లీనప్ మోడ్‌లో!

రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వాసన్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవల గురించి చర్చ జరిగింది. ఈ సేవలను మరింత మంది రైతులకు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.

ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలెర్ట్! నేటి నుండే వాటికి ఆన్‌లైన్ దరఖాస్తులు!

ఈ సమీక్షా సమావేశంలో సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) వాకాటి కరుణ, డిప్యూటీ CEO శ్రీరాములు నాయుడు, స్త్రీనిధి ఎండీ హరిప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి ఇచ్చిన దిశానిర్దేశాలను తక్షణమే అమలు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టుల వేగవంతమైన అమలు ద్వారా లక్ష్యాలను నిర్ణీత సమయానికి చేరుకోవాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీలో ఆ గ్రౌండ్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంగా ఆధునీకరణ.. త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు!
US Visa Fees: జనవరి నుంచి అమెరికా వీసా ఫీజులు పెంపు – భారత టెక్కీలకు దిమ్మతిరిగే షాక్!!
మరో కొత్త బైపాస్! ఇక అక్కడికి దూసుకెళ్ళిపోవచ్చు... గంట సమయం ఆదా!

Spotlight

Read More →