Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ!

US Visa Fees: జనవరి నుంచి అమెరికా వీసా ఫీజులు పెంపు – భారత టెక్కీలకు దిమ్మతిరిగే షాక్!!

అమెరికా ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి ఇమ్మిగ్రేషన్ మరియు బోర్డర్ సంబంధిత సేవలకు కొత్తగా ఫీజులు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్పులను అక్కడి హో

Published : 2025-11-21 08:29:00

అమెరికా ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి ఇమ్మిగ్రేషన్ మరియు బోర్డర్ సంబంధిత సేవలకు కొత్తగా ఫీజులు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్పులను అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకటించగా ఈ నిర్ణయం భారతీయ వీసా దరఖాస్తుదారులు, కంపెనీలు, విదేశాల్లో ఉద్యోగాలు ఆశించే యువతపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికా హై-స్కిల్ వీసా కేటగిరీలలో ముఖ్యమైన H-1Bపై ఈ మార్పులు ఎక్కువగా కనిపించనున్నాయి. ఇప్పటికే ఈ వీసాకు పోటీ ఎక్కువగా ఉండగా, ఇప్పుడు ఫీజుల పెరుగుదల దరఖాస్తుదారులకు అదనపు భారంగా మారవచ్చు. కొత్త చట్టం ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి కనీస ఫీజులు నిర్ణయించగా, ప్రతి సంవత్సరం వాటిని సవరించడం తప్పనిసరి చేశారు. దీంతో వచ్చే ఏడాది నుంచే కొత్త ఫీజులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, స్టార్టప్ సంస్థలు, పెద్ద కంపెనీలు‌ అందరూ ఈ మార్పుల ప్రభావాన్ని అనుభవించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒక ఉద్యోగిని H-1B వీసాతో అక్కడ నియమించుకోవడానికి కంపెనీలు ఇప్పటికీ భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. ఇప్పుడు ఫీజులు పెరిగితే కంపెనీలకు ఖర్చు మరింతగా పెరుగుతుంది. దీంతో కొంతమంది అమెరికా సంస్థలు స్థానిక ఉద్యోగ నియామకాన్ని పెంచే దిశగా వెళ్లవచ్చు. మరోవైపు, భారత సంస్థలు అమెరికాలో ఉద్యోగ అవకాశాలను తగ్గించి, పనులను భారత్‌కే మార్చే పరిస్థితి రావచ్చు.

వీసా దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఉండే కొత్త “వీసా సమగ్రత ఫీజు” (Visa Integrity Fee) కూడా అభ్యర్థులకు అదనపు రుసుము అవుతుంది. ఈ ఫీజు అమలులోకి వచ్చాక, వీసా దరఖాస్తు ఖర్చు మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే H-1B లాటరీ, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులు వంటి వ్యయాలు ఉండగా, ఇప్పుడు కొత్త రుసుములు భారతీయ కుటుంబాలపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తాయని భావిస్తున్నారు.

అభ్యర్థులే కాకుండా  భారతీయ విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విద్యార్థి వీసాలపై ప్రత్యక్ష ప్రభావం ఎక్కువగా లేకపోయినా, అమెరికాలో ఉద్యోగ అవకాశాలపై జరిగే మార్పులు వారి భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. OPT, STEM విస్తరణలు, ఉద్యోగ అవకాశాల్లో పోటీ—ఇవన్నీ పరోక్షంగా ఈ ఫీజుల మార్పులతో సంబంధం ఏర్పరచుకోవచ్చు.

ఆర్థిక నిపుణులు ఈ మార్పులతో రాబోయే కాలంలో భారతీయ ఐటీ కంపెనీల షేర్ మార్కెట్ మీద కూడా ప్రభావం కనిపించవచ్చని చెబుతున్నారు. అమెరికా మార్కెట్‌పై ఆధారపడే సంస్థలకు ఖర్చు పెరగడం వల్ల లాభాలు తగ్గే అవకాశం ఉంది. గతంలో కూడా వీసా విధానాల్లో మార్పులు వచ్చినప్పుడు, ఐటీ సంస్థల స్టాక్‌లు స్వల్పంగా ఒత్తిడికి గురైన సందర్భాలు ఉన్నాయి.

అమెరికాలో ఉద్యోగం లేదా చదువు కోసం ప్రయత్నించే భారతీయులు ఇటువంటి మార్పులపై అధికారిక ప్రకటనలను, USCIS మార్గదర్శకాలను, రాయబార కార్యాలయాల అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా పరిశీలించడం అత్యంత కీలకం. కొత్త ఫీజులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? ఏ వీసా వర్గాలపై వర్తిస్తాయి? మినహాయింపులు ఉన్నాయా?అన్న విషయాలపై స్పష్టమైన సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

అంతర్జాతీయ విద్య, విదేశీ ఉద్యోగాలు, ఐటీ రంగం ఇవి మూడూ భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవే. అందుకే అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం భారతీయుల దృష్టిలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Spotlight

Read More →