LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా?

Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్ వరుసగా బహిరంగ సభలను ఎందుకు రద్దు చేసుకుంటున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు రాజకీయ విశ్లేషణ..

AndhraPravasi News Desk 2 min read
Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా?

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన దళపతి విజయ్.. కీలక సమయంలో తన ప్రచార సభలను వరుసగా రద్దు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో, ఆయన నిర్ణయం సొంత పార్టీ శ్రేణుల్లో కూడా అయోమయాన్ని నింపుతోంది.

సాధారణంగా కొత్తగా పార్టీ పెట్టిన నేతలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లాలని చూస్తారు. కానీ విజయ్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మార్చి 15న ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఆయన పాల్గొనాల్సిన అనేక బహిరంగ సభలు ఆగిపోయాయి. కేవలం పోలీసుల అనుమతి లేకపోవడం వల్లే ఇవి రద్దు కాలేదని, అన్ని రకాల పర్మిషన్లు ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. ఇది అటు ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విమర్శనాస్త్రంగా మారింది.

ప్రచార షెడ్యూల్‌ను గమనిస్తే.. మార్చి 30న నామినేషన్ వేసిన తర్వాత విజయ్ పెరంబూరు, కొలాతూర్‌లో సందడి చేశారు. కానీ ఆ తర్వాత జరగాల్సిన విల్లివక్కమ్ సభ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు అయింది. ఏప్రిల్ 6న టి. నగర్‌లో జరగాల్సిన రోడ్ షో సమయాభావం వల్ల ఆగిపోయింది. ఇలా వరుసగా ఏప్రిల్ 9, 11, 13 తేదీల్లో కడలూరు, తిరువళ్లూరు ప్రాంతాల్లో జరగాల్సిన సభలను కూడా పక్కన పెట్టేశారు. దీనిపై పార్టీ వర్గాల నుండి స్పష్టమైన వివరణ రాకపోవడం గమనార్హం.

అయితే, ఈ రద్దుల వెనుక ఒక పాత చేదు జ్ఞాపకం ఉండి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు టీవీకే మేనేజ్‌మెంట్ లోపమే కారణమని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వేళ భారీ జనసందోహం మధ్య అలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని విజయ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం.

మరోవైపు విజయ్ తీరుపై ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. ఆయనకు ప్రజల్లోకి రావడం ఇష్టం లేదని, అందుకే 'వర్క్ ఫ్రమ్ హోమ్' పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. టీవీకే అభ్యర్థులు చాలామంది కొత్తవారే కాబట్టి, విజయ్ ప్రచారం చేయకపోతే వారికి కనీసం గుర్తింపు కూడా రాదని వారు వాదిస్తున్నారు. మరి ఈ విమర్శలను తిప్పికొడుతూ విజయ్ మిగిలిన కొద్ది రోజుల్లో ఎలా పుంజుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా తమిళ రాజకీయాల్లో ఈ 'దళపతి' మార్క్ సైలెన్స్ ఇప్పుడు పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…