LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Minister Anita: ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను పరిష్కరించాం..హోం మంత్రి అనిత.

Minister Anita: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికీ, ముఖ్యంగా సీఎం చంద్రబాబ…

AndhraPravasi News Desk 2 min read
Minister Anita: ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను పరిష్కరించాం..హోం మంత్రి అనిత.
  • అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి..
     
  • రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే..

Minister Anita: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికీ, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకే  దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. 

అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీననే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్‌ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. కూటమి పాలనలో అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70 నుండి 96 శాతానికి పెరిగిందని ఆమె తెలిపారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని, 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే గ్రాట్యుటీ చెల్లింపులకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. 

అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, ఆర్‌వో యంత్రాలు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజుల సెలవులు మంజూరు చేసినట్లు చెప్పారు. చిన్నారుల అభివృద్ధికి ఆటవస్తువులు, పాఠ్య చార్టులు, ఇండక్షన్ స్టవ్‌లు, నాణ్యమైన వంట పాత్రలు అందజేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి కల్పించి పూర్తి స్థాయి వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. అదనంగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు చెప్పారు. 

అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి వెళ్లిందని ఆరోపించిన మంత్రి, వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు మరిన్ని అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. అయినప్పటికీ ప్రతి నెల ఒకటో తేదీననే వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వమేనని హోంమంత్రి అనిత తెలిపారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…