Tamil Nadu Elections 2026: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అంతా ‘దళపతి’ విజయ్ గురించే చర్చ నడుస్తోంది. నటుడిగా శిఖరాగ్రాన ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన విజయ్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నారు. అయితే, మే 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాలు విజయ్‌కు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. దానికి కారణం ఆ రోజు విజయ్ పొలిటికల్ రిజల్ట్స్‌తో పాటు, ఆయన స్నేహితురాలు పుట్టినరోజు కూడా కావడమే.
విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన వ్యక్తిగత జీవితంపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో విబేధాలు రావడం, ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం వంటి వార్తలు తమిళనాట కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 20న విజయ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అందడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. మరోవైపు విజయ్, త్రిషల మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే ఈ గొడవలు మొదలయ్యాయనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది.
రాజకీయంగా చూస్తే తమిళనాడు ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. విజయ్ తన పార్టీ ద్వారా ఒంటరిగా పోరాడుతారా లేక పొత్తులకు వెళ్తారా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కానీ, మే 4న వచ్చే ఫలితాలు ఆయన భవిష్యత్తును తేల్చనున్నాయి. ఒకవేళ విజయ్ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించి కింగ్ మేకర్ అయినా లేదా అధికారంలోకి వచ్చినా.. అది ఆయనకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఎందుకంటే అదే రోజు త్రిష బర్త్‌డే కావడంతో అభిమానులు దీనిని ‘డబుల్ ట్రీట్’గా అభివర్ణిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో విజయ్-త్రిష జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇటీవల కాలంలో వీరిద్దరూ పదే పదే కలిపి కనిపిస్తుండటం, వివాహ వేడుకలకు హాజరుకావడం వంటివి అనుమానాలకు తావిచ్చాయి. త్రిష కూడా త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మే 4వ తేదీన విజయ్ రాజకీయ గెలుపును, త్రిష పుట్టినరోజును కలిపి సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
అయితే, వ్యక్తిగత ఇబ్బందులు ఒకవైపు.. రాజకీయ సవాళ్లు మరోవైపు విజయ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక సామాన్య నటుడిగా కాకుండా, ప్రజా నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్న విజయ్‌కు ఈ మే 4వ తేదీ నిజంగానే ‘లక్కీ డే’ అవుతుందో లేదో వేచి చూడాలి. ప్రత్యర్థి పార్టీలు ఆయన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తున్నా, దళపతి మాత్రం తన ఫోకస్ అంతా ప్రజలపైనే ఉందని చాటిచెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయ చిత్రపటాన్ని ఎలా మారుస్తాయో చూడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.