LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Vehicle Registration: రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్‌కు వేగం.. 24 గంటల్లోనే పూర్తి చేయనున్న ప్రభుత్వం!

Vehicle Registration: రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ వంటి ప్రక్రియలు 24 గంటల్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

AndhraPravasi News Desk 1 min read
Vehicle Registration: రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్‌కు వేగం.. 24 గంటల్లోనే పూర్తి చేయనున్న ప్రభుత్వం!

రాష్ట్రంలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్..

శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ 24 గంటల్లో పూర్తి..

రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ వంటి ప్రక్రియలు 24 గంటల్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వాహన డీలర్లు టెంపరరీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత అధికారులు 24 గంటల్లోపు ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తు చేసుకునే వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

అంతేకాకుండా, నిర్ణీత గడువులోపు అధికారులు స్పందించకపోతే రిజిస్ట్రేషన్‌కు ఆటోమేటిక్‌గా ఆమోదం లభించే విధానాన్ని కూడా తీసుకురానున్నారు. దీని వల్ల వాహనదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా ఆమోదాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా మారుతుందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…