Chandrababu: హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్.. బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు! PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ: రేపు మధ్యాహ్నం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు! 2,000 మంది పోలీసులతో.. Telangana: రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్.. హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు! Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం! Amaravati: రాజధానిలో అత్యంత వేగంగా పూర్తవుతున్న రహదారి ఇదే! PM Modi: చారిత్రక విజయం.. వినమ్రంగా కృతజ్ఞతలు.. వేదికపై సాష్టాంగ పడి నమస్కరించిన ప్రధాని! Mamata Banerjee: 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో.. Pawan Kalyan: దశాబ్దాల పోరాటానికి ఫలితం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల గెలుపు.. పవన్ కల్యాణ్ హర్షం! Vijay: అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్! AP Secretariat: సచివాలయం వద్ద హై అలర్ట్... ప్రభుత్వం సీరియస్! అసలు విషయం ఏమిటంటే? Chandrababu: హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్.. బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు! PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ: రేపు మధ్యాహ్నం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు! 2,000 మంది పోలీసులతో.. Telangana: రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్.. హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు! Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం! Amaravati: రాజధానిలో అత్యంత వేగంగా పూర్తవుతున్న రహదారి ఇదే! PM Modi: చారిత్రక విజయం.. వినమ్రంగా కృతజ్ఞతలు.. వేదికపై సాష్టాంగ పడి నమస్కరించిన ప్రధాని! Mamata Banerjee: 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో.. Pawan Kalyan: దశాబ్దాల పోరాటానికి ఫలితం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల గెలుపు.. పవన్ కల్యాణ్ హర్షం! Vijay: అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్! AP Secretariat: సచివాలయం వద్ద హై అలర్ట్... ప్రభుత్వం సీరియస్! అసలు విషయం ఏమిటంటే?

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీవీకే… కాంగ్రెస్ మద్దతుతో సంఖ్య పెంపు, సీఎం ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ఇవ్వాలని అధికారికంగా ప్రకటించడం కీలక మలుపుగా మారింది.

Published : 2026-05-06 10:49:00

తమిళనాడులో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే..

విజయ్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ప్రకటన..

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు టీవీకేకు ఇంకా 10 సీట్లు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ఇవ్వాలని అధికారికంగా ప్రకటించడం కీలక మలుపుగా మారింది. ఐదు సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 113కు చేరనుంది. అయినప్పటికీ మెజారిటీకి ఇంకా ఐదు సీట్లు అవసరం ఉంది.

ఇక టీవీకేకు ఇతర పార్టీల మద్దతు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే కూడా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన పీఎంకేతో పాటు సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా ముందుకు రావడంతో టీవీకే బలం 125 సీట్లకు చేరే అవకాశముంది. ఈ పరిణామాలు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బలమైన పునాది వేస్తున్నాయి.

ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చలు కొనసాగిస్తున్న టీవీకే అధ్యక్షుడు విజయ్, ఈరోజు గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు వివరాలను సమర్పించే అవకాశముంది. అన్ని అనుకూలిస్తే, రేపే చెన్నైలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తమిళనాడు రాజకీయాలకు కొత్త దిశను సూచిస్తున్నాయి.

Spotlight

Read More →