LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

Congress party: కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)ను ప్రకటించిన కొద్దిసేపటికే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

AndhraPravasi News Desk 2 min read
Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!
  • Politics: అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్..
     
  • బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి..

Congress party: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) ప్రకటన పెను దుమారం రేపుతోంది. పార్టీ ఆవిష్కరణ సభలో ఆమె తన తండ్రి కేసీఆర్‌ను 'మరమనిషి' అని సంబోధించడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను 'హిట్లర్ పాలన'తో పోల్చడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కవిత కొత్త పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కొత్త పార్టీ స్వతంత్రమైనది కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో ఇదొక భాగమని ఆయన కొట్టిపారేశారు.

కవిత స్థాపించిన పార్టీని కేవలం బీఆర్ఎస్ కు ఒక 'తోక పార్టీ'గా రామ్మోహన్ రెడ్డి అభివర్ణించారు. తండ్రి, తనయ మధ్య విభేదాలు కేవలం పైపైన కనిపిస్తున్నవే తప్ప, అంతర్గతంగా వారిద్దరూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. "బాపు నడిపే బీఆర్ఎస్ లో అంతర్భాగమే తనయ స్థాపించిన ఈ టీఆర్ఎస్" అని పేర్కొంటూ, తలా తోక ఎప్పుడూ విడిపోవని ఎద్దేవా చేశారు. కవిత తన ప్రసంగంలో తండ్రిపై చేసిన విమర్శలు కేవలం ప్రజల సానుభూతి పొందడానికేనని, ఇదంతా కేవలం 'గ్యాస్' అని ఆయన సెటైర్లు వేశారు. తండ్రి చాటు బిడ్డగానే కవిత రాజకీయ ప్రస్థానం సాగిందని, ఇప్పుడు హఠాత్తుగా కొత్త పార్టీ పేరుతో రావడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందన్నది కాంగ్రెస్ నాయకుల వాదన.

మరోవైపు, కవిత తన పార్టీ ద్వారా బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ లేదా బీఆర్ఎస్ అగ్రనేతలు ఇంతవరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఒకవైపు అధికార పార్టీ విమర్శలు, మరోవైపు సొంత కుటుంబంపై కవిత చేసిన ఆరోపణలతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ కొత్త పార్టీ ద్వారా కవిత భవిష్యత్తులో నిజంగానే స్వతంత్ర శక్తిగా ఎదుగుతారా లేదా అధికార పార్టీ అంటున్నట్లుగా అది బీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…