LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సంచలన నిర్ణయం..!!

Tamil Nadu Elections 2026: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని దళపతి విజయ్ స్పష్టం చేశారు. భారీ ఆఫర్లు వచ్చినా కాదని, సిద్ధాంతాలకే ప్రాముఖ్యత ఇస్తానని ఆయన ప్రకటించారు

AndhraPravasi News Desk 2 min read
Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సంచలన నిర్ణయం..!!

Tamil Nadu Elections 2026: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు శరవేగంగా మారుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయం  గురించి స్పష్టం చేశారు. గత కొన్నాళ్లుగా సాగుతున్న పొత్తుల ఊహాగానాలకు తెరదించుతూ, 2026 ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఏ పార్టీతోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజల నమ్మకమే తమకు ప్రధాన బలమని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మమల్లాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయ్, తన రాజకీయ లక్ష్యాలను కుండబద్దలు కొట్టారు. లౌకికవాదం, సామాజిక న్యాయం అనేవి తమ పార్టీకి రెండు కళ్లు అని, కేవలం అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టలేమని చెప్పారు. ఢిల్లీ పాలకుల ఒత్తిళ్లకు లొంగేది లేదని, తమిళ ప్రజల ఆత్మగౌరవమే తమ నినాదమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాల మద్దతు కూడగట్టేలా ఆయన ప్రసంగం సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయ్ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టీవీకేకు భారీ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 90 సీట్లతో పాటు రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని పంచుకుందామనే ప్రతిపాదనలు కూడా వచ్చాయట. కానీ, అడ్డదారిలో పదవులు దక్కించుకోవడం కంటే, స్వతంత్రంగా ప్రజల మనసు గెలవడమే ముఖ్యమని విజయ్ భావిస్తున్నారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు, టీవీకే వ్యూహకర్తలు క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంతో నిరాశ చెందిన వర్గాలను తమవైపు తిప్పుకోవాలని విజయ్ టీమ్ భావిస్తోంది. యువత  మహిళా ఓటర్లే లక్ష్యంగా కొత్త తరహా ప్రచారానికి పార్టీ సిద్ధమవుతోంది.

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలు ఉండగా, విజయ్ ఒంటరి పోరు ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం. అధికారం పక్షంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీవీకే భావిస్తోంది. ఏది ఏమైనా, విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ముక్కోణపు పోటీ నెలకొంటే సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…