ఐబొమ్మ రవి కేసు రోజురోజుకూ ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఈ కేసుపై రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో MLC తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై ఆయన గుప్పించిన విమర్శలు సోషల్ మీడియాలో తూటాల్లా పేలిపోతున్నాయి. మల్లన్న మాట్లాడిన తీరు ఉపయోగించిన పదాలు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని నేరుగా ప్రతిబింబించాయి.
ఐబొమ్మ రవిని అతని భార్య హింట్ ఇచ్చాకే పట్టుకున్నారు. మీ అసోసియేషన్‌లో ఉన్న కుక్కలకైనా అతని వాసన దొరకలేదు.. సవాల్ వేస్తే గొప్పగా అనుకుంటావా? దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు కొండంతగా ఉన్నాయి. నిజంగా నువ్వు మొనగాడివైతే అవి సాల్వ్ చేసి చూపు అని మల్లన్న ఘాటుగా వ్యాఖ్యానించారు.
సినిమా డైలాగులు ఎందుకు చెబుతున్నావు? సినిమా వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని… వాళ్లు ఏమైనా సంసారులా? థియేటర్లలో పాప్‌కార్న్ ₹300, నీళ్ల బాటిల్ ₹100 — బంగారం అమ్ముతున్నట్టు లేదు? సాధారణ ప్రజల రక్తం తాగుతున్నారు. అధికారులు మాత్రం చూసీ చూడని వేషం. మధ్యతరగతి ప్రజలకు రవి దేవుడిలా కనిపించడం ఆశ్చర్యమే లేదు, అని ఆయన మరింత తీవ్రంగా విమర్శించారు.
ఐబొమ్మ రవికి ప్రజల మద్దతు రావడానికి కారణం ఇదేనని మల్లన్న అన్నారు. అందుకే ప్రజలు ఆయన వెంటే ఉన్నారు. రవి భార్య హింట్ ఇచ్చాకే పోలీసులు పట్టుకున్నారు. మీరే స్వయంగా పట్టుకుంటే మీకే పేరు వచ్చేది అని వ్యాఖ్యానించారు. సజ్జనార్… నీ జీవితం మొత్తం ఫేక్ ఎన్కౌంటర్. నిన్ను చూసి ప్రజలు భయపడతారు కానీ గౌరవించరు, అని మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్న చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకోవచ్చు . ఈ మధ్య థియేటర్ ఛార్జీలు, టికెట్ రేట్లు, అదనపు ఖర్చులు పెరుగుతూ రావడంతో ప్రేక్షకుల అసహనం మరింత పెరిగింది. అదే అసహనానికి మల్లన్న మాటలు ప్రతిధ్వనిలా మారాయి.
ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చ మొదలైంది. సజ్జనార్ ఇంకా స్పందించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రెండు వర్గాలుగా చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఒకవైపు మల్లన్నకు మద్దతు పలుకుతున్నవారు, మరొకవైపు పోలీస్ వ్యవస్థను సమర్థిస్తున్నవారు కూడా ఉన్నారు.
iBomma Ravi Case: సజ్జనార్… నీ జీవితం ఫేక్ ఎన్కౌంటర్! ఐబొమ్మ రవి కేసుపై మళ్లీ వేడెక్కిన వివాదం!!