LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Pattabhiram: సీఆర్డీఏ అభివృద్ధిపై రాజకీయ వేడి! జగన్‌పై పట్టాభి ఘాటు విమర్శలు..

Pattabhiram: ఏపీ సీఆర్డీఏ పరిధి 8,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధి. జగన్ మూడు ముక్కలాట నాటకం అయిపోయింది.. మావిగన్ మొదలైంది.

AndhraPravasi News Desk 1 min read
Pattabhiram: సీఆర్డీఏ అభివృద్ధిపై రాజకీయ వేడి! జగన్‌పై పట్టాభి ఘాటు విమర్శలు..

APCRDA పరిధితో స్పష్టంగా జీవో 207, 2015 లోనే ఇచ్చినా.. సరిగా చూడకుండా మాట్లాడతారా?

జగన్.. ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు -పట్టాభి..

అమరావతి: ఏపీ సీఆర్డీఏ పరిధిలోని అభివృద్ధి అంశంపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.

సీఆర్డీఏ పరిధి మొత్తం 8,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని ఆయన తెలిపారు. బందరు సమీపంలోని చల్లపల్లి, మోపిదేవి నుంచి గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఈ పరిధి విస్తరించి ఉందని వివరించారు. కేవలం అమరావతి మాత్రమే కాదు, మొత్తం సీఆర్డీఏ పరిధిలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు విజన్ వల్లే ఈ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. సీఆర్డీఏ మ్యాప్‌ను చూస్తే ఆయన దూరదృష్టి ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.

మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ, “మూడు ముక్కలాట నాటకం ముగిసిపోయింది.. ఇప్పుడు కొత్తగా ‘మావిగన్’ అంటూ మరో నాటకం మొదలైంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న అసహనంతోనే జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

సీఆర్డీఏ చట్టంపై కూడా పట్టాభి ప్రశ్నలు లేవనెత్తారు. “సీఆర్డీఏ అవసరం లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారు? ఆ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయలేదా?” అని ప్రశ్నించారు. ఇప్పటికే 2015లోనే జీఓ 207 ద్వారా సీఆర్డీఏ పరిధిని స్పష్టంగా నిర్ణయించారని, అవి తెలుసుకోకుండా మాట్లాడటం సరి కాదని విమర్శించారు.

అలాగే బిల్లు, తీర్మానం మధ్య తేడా కూడా జగన్ బృందం అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్ని నాటకాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి, సీఆర్డీఏ అభివృద్ధి అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీస్తూ, మాటల తూటాలు పేలుతున్నాయి.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…