Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!

Ravi Naidu: తణుకులో క్రీడా విప్లవం: శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణల సుడిగాలి పర్యటన!

Ravi Naidu Sports: తణుకు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ శ్రీ రవి నాయుడు గారు తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారితో కలిసి పలు క్రీడా సదుపాయాలను ప్రారంభించి, పరిశీలించారు.

Published : 2026-03-10 21:31:00
  • క్రీడాకారులకు మహర్దశ: తణుకు ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణకు శాప్ చైర్మన్ హామీ…
     
  • క్రీడాకారుల నైపుణ్యానికి పదును: తణుకులో క్రికెట్ నెట్స్, క్రీడా సదుపాయాల పరిశీలన..

Ravi Naidu Sports: తణుకు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ శ్రీ రవి నాయుడు గారు తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారితో కలిసి పలు క్రీడా సదుపాయాలను ప్రారంభించి, పరిశీలించారు.

తణుకు పట్టణం 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, పికిల్ బాల్ మరియు బ్యాడ్మింటన్ కోర్టులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి నాయుడు గారు మాట్లాడుతూ తణుకు పట్టణంలోని పార్కుల్లో ప్రజలకు, ముఖ్యంగా యువతకు క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ దిశగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మున్సిపల్ ఇండోర్ స్టేడియం, జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ సదుపాయాలను వారు పరిశీలించారు. ఇండోర్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా మరమ్మత్తులు మరియు ఆధునీకరణ కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడు గారిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రవి నాయుడు గారు త్వరలోనే అవసరమైన కార్యచరణ రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదే పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్రికెట్ నెట్స్‌ను కూడా పరిశీలించారు. అలాగే ఎస్సీఐఎం డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్మిస్తున్న సింథటిక్ వాకింగ్ ట్రాక్ పనులను సందర్శించి పురోగతిని సమీక్షించారు. క్రీడాకారుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు కోరగా, దీనిపై రవి నాయుడు గారు సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం తణుకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ నిధులతో నిర్మిస్తున్న క్రీడా వికాస్ కేంద్రాన్ని వారు పరిశీలించారు. నిర్మాణం చివరి దశలో ఉన్న స్టేడియాన్ని పరిశీలించిన రవి నాయుడు గారు కొన్ని తుదిమెరుగులు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులకు సూచించారు. అతి త్వరలోనే ఈ క్రీడా వికాస్ కేంద్రాన్ని తణుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

అనంతరం తణుకు నియోజకవర్గంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ గారు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేసిన కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు గారు పాల్గొన్నారు.

తణుకులో హెచ్ పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం!! 
చివరిగా, తణుకు పట్టణంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ కోసం హెచ్ పీవీ వాక్సినేషన్ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ గారితో కలిసి రవి నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఈ వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగి, తమ పిల్లలకు తప్పకుండా వేయించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమాల్లో శాప్ బోర్డు సభ్యులు, తణుకు ఏఎంసీ చైర్మన్, కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Spotlight

Read More →