Veeranjaneya Swamy: ఒలింపియాడ్‌లో మెరిసిన సింగరాయకొండ ఆణిముత్యాలు: మంత్రి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం!
Veeranjaneya Swamy: ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్ -2 పరీక్షలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించిన మంత్రి డా. స్వామి
- శ్రీచైతన్య విద్యార్థుల ఘనత: ఇంటర్నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్‌లో ఉత్తమ ప్రతిభ..
- ఒంగోలు వేదికగా జరిగిన INTSO పరీక్షలో సింగరాయకొండ శ్రీచైతన్య స్కూల్ హవా!
Singarayakonda Olympiad Minister hands over prizes: ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్ -2 ఎగ్జామ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బహుమతులు అందజేశారు. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో సింగరాయకొండ శ్రీచైతన్య టెక్ నో స్కూల్ బ్రాంచ్ కి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. మునగపాటి రుత్విక్ (6వ )గ్రాండ్ ప్రైజ్ లాప్టాప్ సాధించాడు. తోట నిఖిలేష్ యాదవ్ (3వ) తరగతి మొదటి బహుమతి టాబ్ సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మణ్, డీన్ శ్రీనివాస రావు, ప్రైమరీ ఇంచార్జి అమరవేణి, ఏవో మధుబాబు పాల్గొన్నారు.
Be the first to react