LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Russia Ukraine War: పుతిన్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్ దోస్తీ కంటే ఉక్రెయిన్ సెటిల్‌మెంటే ముఖ్యామా?

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా ఇంటెలిజెన్స్ సాయం నిలిపివేస్తే, ప్రతిగా ఇరాన్‌కు సహకరించబోమని రష్యా ప్రతిపాదించిందా? అమెరికా మీడియాలో వస్తున్న కథనాలపై రష్యా స్పందన మరియు ట్రంప్ ప్రభుత్వ వైఖరి గురించి పూర్తి వివరాలు

AndhraPravasi News Desk 2 min read
Russia Ukraine War: పుతిన్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్ దోస్తీ కంటే ఉక్రెయిన్ సెటిల్‌మెంటే ముఖ్యామా?

అసలేం జరిగింది?

ఖండించిన రష్యా

ఇరాన్-రష్యా దోస్తీ

Putin Ukraine Strategy: ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చిరకాల మిత్రదేశం ఇరాన్‌కు హ్యాండ్ ఇస్తారా? ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా సాయాన్ని అడ్డుకునేందుకు ఇరాన్‌తో ఉన్న సంబంధాలను పణంగా పెడతారా? ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ  ఇటీవల ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. రష్యా రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధులతో మయామిలో రహస్యంగా భేటీ అయ్యారని, ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారని ఆ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ బలగాలకు అమెరికా అందిస్తున్న రహస్య సమాచారాన్ని , ప్రతిగా రష్యా కూడా ఇరాన్‌కు ఎలాంటి యుద్ధ సమాచారాన్ని అందించదని పుతిన్ వర్గం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కట్టుకథలని, పశ్చిమ దేశాలు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని రష్యా రాయబారి దిమిత్రీవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. అమెరికాలోని కొంతమంది రిపబ్లికన్ నేతలు కూడా ఈ కథనాన్ని తప్పుబట్టారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సాగదీయాలని చూసేవారే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్, రష్యాలు ప్రాణస్నేహితుల్లా మెలుగుతున్నాయి. రష్యాకు అవసరమైన డ్రోన్లను ఇరాన్ సరఫరా చేస్తుండగా, ప్రతిగా ఇరాన్‌కు రష్యా సాంకేతిక సాయం అందిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో అమెరికా యుద్ధ నౌకలు ఎక్కడ ఉన్నాయి? వాటి కదలికలు ఎలా ఉన్నాయి? అనే కీలక సమాచారాన్ని రష్యా రహస్యంగా ఇరాన్‌కు చేరవేస్తోందని అమెరికా గూఢచారి సంస్థలు అనుమానిస్తున్నాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. రష్యా గనుక ఇరాన్‌కు సహకరిస్తే తాము ఊరుకోబోమని ఇప్పటికే హెచ్చరించారు. రష్యా ఇరాన్‌కు సమాచారం ఇస్తుంటే అది మాకు సంతోషం కలిగించే విషయం కాదు" అని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్‌ను ఒంటరిని చేసేందుకు పుతిన్ సిద్ధపడితే, అది ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.ప్రస్తుతానికైతే ఇది కేవలం వార్తలకే పరిమితమైనా, ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి రావాలంటే ఇలాంటి అనూహ్యమైన ఒప్పందాలు జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…