ఆకాశవాణి భవన్‌లో హైడ్రామా.. రాహుల్‌, ప్రియాంకపై కేసు నమోదు!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ఎంపీలు, ఇతరులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాశవాణి భవన్‌లోకి బలవంతంగా ప్రవేశించారంటూ అక్కడి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో మంగళవారం రాత్రి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Delhi Police File FIR Against Rahul Gandhi, Priyanka Gandhi
Delhi Police File FIR Against Rahul Gandhi, Priyanka Gandhi
  • ఆకాశవాణి భవన్‌లోకి బలవంతంగా ప్రవేశించారన్న ఆరోపణలపై  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాపై కేసు నమోదైంది.  
  • ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ఎంపీలు, ఇతరులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాశవాణి భవన్‌లోకి బలవంతంగా ప్రవేశించారంటూ అక్కడి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో మంగళవారం రాత్రి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ నుంచి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ఎంపీలు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు అక్కడే నిరసనకు దిగారు.

బారికేడ్లపైకి ఎక్కిన రాహుల్

ఎన్నికల సంఘం కార్యాలయం వైపు సాగిన ర్యాలీలో రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ‘వోట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. నితి ఆయోగ్ కార్యాలయం సమీపంలో ఎంపీలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆకాశవాణి భవన్‌లోకి వెళ్లిన రాహుల్

పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఆకాశవాణి ప్రాంగణంలోకి వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, ఎంపీలతో కలిసి సుమారు ఎనిమిది గంటలకు పైగా నిరసన కొనసాగింది.

నిరసన ముగిసిన అనంతరం పోలీసులు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ఎంపీలను అక్కడి నుంచి తరలించారు. కే.సీ. వేణుగోపాల్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పవన్ ఖేరా, కే. సురేశ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హుడా, ప్రణితి షిండే, వర్షా గైక్వాడ్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి తదితరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

250 మందికి పైగా అదుపులోకి..

పోలీసుల ప్రకారం.. సుమారు 250 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో దాదాపు 50 మంది ఎంపీలు ఉన్నారు. వీరిని కింగ్స్‌వే క్యాంప్‌లోని న్యూ పోలీస్ లైన్స్‌కు తరలించారు. అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను విడుదల చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

‘ఓటు చోరీ’ ఆరోపణలపై నిరసన

ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు ఈ ఆందోళన చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలకు సంబంధించిన మీడియా కథనాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Be the first to react

Latest