AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Industrial Smart City: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ... ప్రత్యేకతలు ఇవే! Chandrababu Naidu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదు! డ్రగ్స్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Industrial Smart City: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ... ప్రత్యేకతలు ఇవే! Chandrababu Naidu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదు! డ్రగ్స్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే!

Potti Sreeramulu: 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం... పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్!

Potti Sreeramulu: ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

Published : 2026-03-16 13:40:00
  • ఆంధ్రుల ఆత్మబలిదానానికి నిదర్శనం: అమరావతిలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు..
     
  • అమరజీవికి ఘన నివాళి: సీఎం, డిప్యూటీ సీఎంల చేతుల మీదుగా 'స్మృతివనం' ప్రారంభం..

Potti Sreeramulu: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు గారు. వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరజీవి త్యాగ శిల్పం వద్ద మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు.

 అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటుచేస్తోంది. 6 నెలల రికార్డు సమయంలోనే ప్రాజెక్ట్ మొదట దశ పనులు పూర్తిచేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. జై వాసవీ మాత. ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం. అమరజీవి.. చిరంజీవి. మరణంలేని గొప్ప శక్తి. త్యాగానికి మానవరూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో జీవించే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. డూండి రాకేష్ నా దగ్గరకు వచ్చి ఏం పేరు పెట్టాలనేదానిపై సలహా అడిగారు. అప్పుడు నా మనసులో తోచింది ఒక్కటే ఆ విగ్రహం చూస్తే ఆయన త్యాగం గుర్తుకురావాలి. అందుకే ‘స్టాచ్యూ ఆప్ శాక్రిఫైస్’ అని పెడదాం అని చెప్పాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.

నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నాను
నేను తెలుగువాడిని, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడినని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ గర్వం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఒక వ్యక్తి కాదు తెలుగు గౌరవం. ఆయన ప్రాణత్యాగం.. మన రాష్ట్రం. ఆ మహనీయుడి జయంతి.. మన ఆంధ్రులకు పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.

ఈ విగ్రహం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మనకు నిత్యం గుర్తుచేస్తుంది
యువగళం పాదయాత్రలో నేను ఆర్యవైశ్య సోదరులను అనేకసార్లు కలిశాను. వాళ్లకి ఉన్న సమస్యల గురించి చర్చించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పరిష్కరించాం, ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా పరిష్కరిస్తాం. అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చాను. ఇచ్చిన హామీని తక్కువ సమయంలోనే నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ 58 అడుగులు అమరజీవి ఆమరణ దీక్షచేసిన 58 రోజులకు సంకేతం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం ఆయన చేసిన త్యాగాన్ని మనకు ప్రతిరోజు గుర్తుచేస్తుంది. మనం ఒకరోజు ఉపవాసం ఉండాలి అంటే ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక రాష్ట్ర ఏర్పాటుకోసం ఆయన 58 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత. 2025 సెప్టెంబర్  3న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. 194 రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం, ట్రస్ట్, అధికారులు, సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు అందరినీ అభినందిస్తున్నాను. మా రౌడీ డూండీని ఎప్పుడూ స్పీడ్ పెంచాలి అంటూ ఉంటాను. విగ్రహ ఏర్పాటుమాత్రం జెట్ స్పీడ్ లో చేశారు. ఇంత స్పీడ్ గా చేస్తారు అని నేను ఊహించలేదు.

అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్యపోరాటయోధుడు
పొట్టి శ్రీరాములు గారు స్వార్థంలేని ఉద్యమం చేశారు. సమాజాభివృద్ధి కోసం ఒక కార్యకర్తలా పనిచేశారు. రాజకీయాలు చేయలేదు. పదవులు ఆశించలేదు. గాంధీ స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో చేరారు. స్వాతంత్ర్యం కోసం పోరాడారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు. నెల్లూరులో దళితులకు ఆలయప్రవేశం కోసం ఉద్య‌మించారు. అంట‌రానిత‌నంపై పోరాడారు. ఐదుసార్లు నిరాహార దీక్షలు చేశారు. నాడు ఆంధ్రుల ఇబ్బందులు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయకపోవడం మహాపాపం అని ప్రకటించారు. కొంద‌రి స్వార్థం కోసం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం బ‌లికాకూడ‌ద‌న్నారు. వ‌స్తే ప్ర‌త్యేక రాష్ట్రం..పోతే త‌న ప్రాణం అనుకున్నారు. దీక్షకు ఎవరూ స్థలం ఇవ్వకపోతే రోడ్డు మీదే ఆమరణదీక్ష చేస్తానన్నారు. ఆయన నిత్యపోరాటయోధుడు. ఆయన నా యువగళం పాదయాత్రకు స్ఫూర్తి. అప్పటి ప్రభుత్వం నా నైట్ బస్ పెట్టుకోవడానికి ఎవరైనా భూమి ఇస్తే 22-ఏలో పెడతామని బెదిరించారు. అప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని. ఎవరూ స్థలం ఇవ్వకపోతే నేను రోడ్డు మీద పడుకుంటా అని.

58 రోజుల‌పాటు దీక్ష చేసి ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు
మ‌ద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో 1952 అక్టోబర్ 19వ తేదీన ఆమ‌ర‌ణ దీక్ష ప్రారంభించారు. దీక్ష మొదటి రోజు 53.9 కేజీల బరువు ఉన్న పొట్టి శ్రీరాములు 58వ రోజు 38.1 కేజీలకు తగ్గారు. పొట్టి శ్రీరాములు గారి స్థానంలో ఏ ఒక్కరున్నా దీక్ష విరమించేవారు. అమరజీవి తాను అనుకున్నట్టే వస్తే రాష్ట్రం..పోతే ప్రాణం అనుకుని దీక్ష విరమించలేదు. 58 రోజుల‌పాటు దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఒక్క‌ ప్రాణ‌త్యాగం కోట్ల మందిని క‌దిలించింది. ఢిల్లీ దిగివచ్చింది. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై అమరజీవి తీవ్ర ప్రభావం చూపారు
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ.. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ఒక వ్యాసం రాశారు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బయట పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయారు అని రాస్తూ.. ఆయన ఏం చెప్పారో తెలుసా? భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై అమరజీవి తీవ్ర ప్రభావం చూపారు. ఆయన దీక్ష తరువాత.. భారతదేశ చిత్రపటంపై భాషాప్రయుక్త రాష్ట్రాల రేఖలు ఏర్పడ్డాయని అన్నారు. పొట్టి శ్రీరాములు గారిని భారతదేశ మెర్కాటర్ గా రామచంద్ర గుహ అభివర్ణించారు. 1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త ఈ మెర్కాటర్. అంతటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారి చరిత్ర దేశం మొత్తం గుర్తుపెట్టుకునేలా ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం.

రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి రోశయ్య గారు
మీతో ఎప్పుడు సమావేశం అయినా మొదట గుర్తొచ్చేది రోశయ్య తాత. ఆయన రాజకీయాల్లో స్టేట్స్ మ్యాన్. ఆయన అసెంబ్లీలో మాట్లాడితే అంతా నిశ్శబ్దం. అంత శ్రద్ధగా వినేవారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి పుట్టిన రోజుకి నేను ఫోన్ చేసి మాట్లాడేవాడిని. రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం రోశయ్య గారు.

అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటుచేస్తాననే యువగళం హామీని నిలబెట్టుకున్నా
ఎన్ని కోరికలు తీర్చినా మన డూండి రాకేష్ కు ఇంకో చివరి కోరిక ఉంటుంది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద స్మారక నాణెం విడుదల చేయాలని అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి స్మారక నాణెం విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన జయంతి రోజున నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నా అదృష్టం. భారతదేశమే ఆశ్చర్యపోయేలా విగ్రహావిష్కరణ జరిగింది. యువగళం హామీ నెరవేర్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారికి, ట్రస్ట్ వారికి, 10 రూపాయల దగ్గర నుంచి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన వారు ఉన్నారు. విరాళం ఎంత అనేది కాదు.. మంచిపనిలో భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచన గొప్పది. సీఆర్డీయే, అధికారులు, ఆర్యవైశ్య పెద్దలకు అందరికీ అభినందనలు. 12 నెలల్లోనే స్మృతి వనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ఎస్. సవిత, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య), ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా, పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సామాజిక వర్గ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Spotlight

Read More →