Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్!
Pawan Kalyan: తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో పవన్ కీలక భేటీ..
తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ వ్యూహరచన..
తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ జనసేన కీలక నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీని మరింతగా తీసుకెళ్లే మార్గాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టి తెలంగాణపై మరింతగా కేంద్రీకృతమైంది. యువత, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగార్థుల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణను పార్టీ బలంగా మార్చే దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు.
అలాగే రాబోయే GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో పార్టీ స్థాయిని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను కూడా లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి నుంచే బూత్ స్థాయి బలపరిచే పనులపై పవన్ నాయకత్వం దృష్టి పెట్టింది. తెలంగాణలో జనసేనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీ కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Be the first to react