LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Palla Srinivasarao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ బాధ్యతలు! సీఎం చంద్రబాబుకు పల్లా కృతజ్ఞతలు!

Palla Srinivasarao: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

AndhraPravasi News Desk 1 min read
Palla Srinivasarao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ బాధ్యతలు! సీఎం చంద్రబాబుకు పల్లా కృతజ్ఞతలు!

బీసీ వర్గాలకు రాజకీయంగా అండగా నిలిచే పార్టీగా టీడీపీ నిలుస్తోంది..

టీడీపీలో కార్యకర్తే అధినేతలు..

అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

బీసీ వర్గాలకు రాజకీయంగా అండగా నిలిచే పార్టీగా టీడీపీ నిలుస్తోందని పల్లా పేర్కొన్నారు. ఒక బీసీ నాయకుడిగా తనకు ఈ స్థాయి గుర్తింపు రావడం, చంద్రబాబు దూరదృష్టి, బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.

పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ కు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ నాయకత్వం పార్టీకి కొత్త దిశ చూపుతుందని, ఆయన పనితీరు టీడీపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పార్టీ క్షేత్ర స్థాయిని బలోపేతం చేయడంతో పాటు యువతను ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

“టీడీపీలో కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతాన్ని మరోసారి గుర్తు చేస్తూ, సామాన్య కార్యకర్తలకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని పల్లా పేర్కొన్నారు. మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలకు కూడా అత్యున్నత కమిటీ అయిన పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం విశేషమని తెలిపారు.

జాతీయ, రాష్ట్ర కమిటీల్లో కొత్తగా నియమితులైన సభ్యులకు పల్లా శ్రీనివాసరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి కృషి, నిబద్ధతకు గుర్తింపుగానే ఈ బాధ్యతలు లభించాయని చెప్పారు. వారి నాయకత్వంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరుతాయని, పార్టీ అన్ని స్థాయిల్లో బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, యువతకు అవకాశాలు కల్పిస్తూ పార్టీని భవిష్యత్ తరాలకు మరింత బలంగా తీర్చిదిద్దుతామని పల్లా స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాయకత్వంపై విశ్వాసంతో, క్షేత్ర స్థాయిలో మరింత శక్తివంతంగా పార్టీ ముందుకు సాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…