Narendra Modi: అదే అసలైన పరీక్ష.. అలా పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు..

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. దేశానికి సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ఆయన అధిగమించారు.

Narendra Modi: అదే అసలైన పరీక్ష.. అలా పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు..
narendra modi says bjp will achieve amazing victory in bengal
  • మోదీ రికార్డుపై ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశం, వేడుకలు..

  • ప్రజాసేవే సుపరిపాలనకు అసలైన పరీక్ష అని 'ఎక్స్'లో పేర్కొన్న ప్రధాని..

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. దేశానికి సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా మోదీ పదవీకాలం 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన వేళ సంబరాలు జరుపుకోవడానికి కూటమి సిద్ధమైంది.

ఈ చారిత్రక ఘట్టంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు అసలైన పరీక్ష. అంకితభావం, వినమ్రత, కర్తవ్య దీక్షతో నిరంతరం పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు" అని ఆయన పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్ల పాలనలో దేశం ఎన్నో చారిత్రాత్మక మార్పులకు లోనైందని, పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ పరమావధిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. అంత్యోదయ సూత్రం ఆధారంగా దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేశామని వెల్లడించారు.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చామని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ), డిజిటల్ ప్లాట్ఫారమ్ల సహాయంతో లబ్ధిదారులకు నేరుగా, పారదర్శకంగా సహాయం అందుతోందని ప్రధాని గుర్తుచేశారు. ఇది అవినీతికి అడ్డుకట్ట వేయడమే కాకుండా పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని బలపరిచిందని అభిప్రాయపడ్డారు. జనధన్ ఖాతాలు, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలన్నీ ప్రజలకు ఆత్మగౌరవాన్ని, మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడమే లక్ష్యంగా సాగాయన్నారు. గరీబ్ కల్యాణ్ (పేదల సంక్షేమం) దిశగా సాగిన ఈ ప్రయాణం.. చివరకు మానవ సాధికారతకు మరియు 'వికసిత భారత్' కల సాకారానికి ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Be the first to react

Latest