⚡ BREAKING

Nadendla Manohar: జనసైనికులకు బంపర్ ఆఫర్.. త్యాగాలు అయిపోయాయ్.! స్థానిక ఎన్నికల పొత్తులపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు!

Nadendla Manohar: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారకముందే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలపై పలు సందర్భాల్లో సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు పదును పెడుతున్నాయి.

జనసైనికులకు బంపర్ ఆఫర్.. ఇప్పుడు అలా కుదరదు.!
జనసైనికులకు బంపర్ ఆఫర్.. ఇప్పుడు అలా కుదరదు.!
  • వైసీపీ విధ్వంస రాజకీయాలు చేస్తోందని, దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ..

  • Politics: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెనక్కి తగ్గామన్న వ్యాఖ్య..

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ నెలలోనే పంచాయతీ, మున్సిపల్, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు వస్తున్న సంకేతాలతో ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిలో (TDP-Janasena-BJP Alliance) సీట్ల సర్దుబాటు అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సార్వత్రిక ఎన్నికల్లో అవ్వాయితీగా సాగిన పొత్తు ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించబోదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

స్థానిక ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధంగా లేం: నాదెండ్ల మనోహర్..
కృష్ణా జిల్లా కైకలూరులో కొత్తగా చేపట్టిన 'జనసేన పార్టీ చర్చావేదిక' కార్యక్రమం సందర్భంగా నాదెండ్ల మనోహర్ కూటమి అంతర్గత పొత్తులపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొన్ని స్థానాల్లో వెనక్కి తగ్గి, త్యాగాలకు సిద్ధపడ్డారని ఆయన గుర్తుచేశారు.

నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన ముఖ్యాంశాలు:

  • ఆ ఫార్ములా కుదరదు: సార్వత్రిక ఎన్నికల సీట్ల పంపకాల నిష్పత్తినే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశిస్తే కుదరదు. ఆ ఫార్ములా ఇక్కడ వర్తించదు.

  • బలాబలాల ఆధారంగానే పోటీ: స్థానిక పరిస్థితులు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలం, క్యాడర్ సామర్థ్యం ఆధారంగానే జనసేన అభ్యర్థుల పోటీ ఉంటుంది.

  • పొత్తు ధర్మం పాటిస్తాం: కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే.. జనసేన బలంగా ఉండి, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రతి స్థానంలోనూ కచ్చితంగా పోటీ చేసి తీరుతాం.

త్వరలోనే జరగబోయే ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

కార్యకర్తలకు భరోసా.. 'జనసేన చర్చావేదిక' ప్రారంభం..
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సగటు జనసైనికులకు, క్షేత్రస్థాయి నాయకులకు ఈ స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం మరియు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని మనోహర్ భరోసా ఇచ్చారు. అందుకోసమే లీడర్లు, కార్యకర్తల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా కైకలూరు వేదికగా 'జనసేన పార్టీ చర్చావేదిక'ను ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఈ వేదిక ద్వారా గ్రామాల్లో ఎదురవుతున్న రాజకీయ ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు.. సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చేస్తున్న దుష్ప్రచారాలను కౌంటర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

అభిప్రాయభేదాలు సహజం.. వైసీపీ విధ్వంసంపై అప్రమత్తత
మూడు పార్టీలు కలిసి కూటమిగా పనిచేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు, భిన్నాభిప్రాయాలు రావడం సహజమని, వాటన్నింటినీ పెద్దమనుషుల తరహాలో సర్దుబాటు చేసుకుని ముందుకు సాగాలని జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష వైసీపీ చూస్తోందని ఆరోపించారు. కూటమిలోని అన్ని పార్టీల శ్రేణులు అంకితభావంతో కలిసికట్టుగా పనిచేసి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు.

Tags

Be the first to react

Latest