LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savitha: భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు ఉద్యమం -మంత్రి సవిత..

Minister Savitha: రాష్ట్రంలో జల సంరక్షణను భగీరథ మహర్షి స్ఫూర్తితో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Minister Savitha: భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు ఉద్యమం -మంత్రి సవిత..

నేడు ఏపీ రాష్ట్ర పండుగగా భగీరథ మహార్షి జయంతి..

గంగను దివి నుంచి భువికి తెచ్చిన మహానీయుడు భగీరథుడు..

రాష్ట్రంలో జల సంరక్షణను భగీరథ మహర్షి స్ఫూర్తితో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులు అమలు అవుతున్నాయని ఆమె చెప్పారు.

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సవిత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గంగను భూమికి తీసుకురావడానికి భగీరథుడు చేసిన కఠోర తపస్సు అపూర్వమని ఆమె కొనియాడారు. సగరుల కులదైవమైన భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.

భగీరథుని పట్టుదల, సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జల సంరక్షణకు పెద్ద ఉద్యమం చేపట్టారని మంత్రి తెలిపారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

రాయలసీమలో సాగునీటి అభివృద్ధికి 2014–19 మధ్య రూ.12,441 కోట్లు ఖర్చు చేసినట్లు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.6,613 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రూ.3,870 కోట్లతో కృష్ణా జలాలను మడకశిర, కుప్పం ప్రాంతాలకు తీసుకువచ్చినట్లు వివరించారు.

వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయి సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తాగునీటి సమస్యల పరిష్కారానికి ‘జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి చెప్పారు. నీటితోనే అభివృద్ధి సాధ్యమనే సీఎం చంద్రబాబు నమ్మకం రాష్ట్రానికి మార్గదర్శకమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నందు అబద్ధయ్య, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…