Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! New Airport: శంషాబాద్ తర్వాత రెండో పెద్ద హబ్... ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో మారనున్న తెలంగాణ ఫేస్! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! New Airport: శంషాబాద్ తర్వాత రెండో పెద్ద హబ్... ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో మారనున్న తెలంగాణ ఫేస్! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం!

Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్!

Nimmala Ramanaidu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి సమస్యపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన ఉదయం ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్‌ను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

Published : 2026-05-17 12:02:00

మున్సిపల్ వాటర్ వర్క్స్‌పై మంత్రి నిమ్మల ఆకస్మిక తనిఖీ..

తాగునీటి సమస్యపై అధికారులకు మంత్రి నిమ్మల క్లాస్..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి సమస్యపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన ఉదయం ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్‌ను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

మంచినీటి చెరువుల్లో ప్రస్తుతం ఎంత నీరు నిల్వ ఉందో, ఇంకా ఎన్ని రోజుల పాటు సరఫరా చేయగలమో అధికారులతో కలిసి మంత్రి అంచనా వేశారు. ముందస్తుగా పరిస్థితిని గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు చేపట్టలేదని అధికారులను ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడే వరకు ఎదురు చూడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట్ల యుద్ధ ప్రాతిపదికన బోరు బావుల త్రవ్వకాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బోరు పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

మంత్రి నిమ్మల రామానాయుడు మంచినీటి చెరువు వద్దే కొంతసేపు గడుపుతూ పరిస్థితిని నేరుగా పర్యవేక్షించారు. మున్సిపల్ అధికారులతో పాటు కిందస్థాయి వాటర్ వర్క్స్ సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోజు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ప్రజల అవసరాలపై ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఘటన మరోసారి చూపించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →