LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: తాడేపల్లి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి లోకేష్.. కుటుంబానికి అన్నివిధాల అండగా..

Nara Lokesh: పవిత్ర రంజాన్ మాసం వేళ జోరువానలోనూ పేద ముస్లీం మైనార్టీ సోదరుడి నివాసానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాకతో ఆ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని పోలకంపాడులో పేద ముస్లీం మైనార్టీ సోదరుడు షేక్ …

AndhraPravasi News Desk 2 min read
Nara Lokesh: తాడేపల్లి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి లోకేష్.. కుటుంబానికి అన్నివిధాల అండగా..
  • కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరణ…
     
  • ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్..

Tadepalli nara Lokesh: పవిత్ర రంజాన్ మాసం వేళ జోరువానలోనూ పేద ముస్లీం మైనార్టీ సోదరుడి నివాసానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాకతో ఆ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని పోలకంపాడులో పేద ముస్లీం మైనార్టీ సోదరుడు షేక్ అమీర్ ఇంటిని మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు. అమీర్ కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. షేక్ అమీర్ విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ముందుగా అమీర్ నివాసానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ను కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్లీం సంప్రదాయం ప్రకారం టోపీ ధరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లీం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇఫ్తార్ విందు స్వీకరించారు.

మంగళగిరిలో త్వరలో మరో 2వేల ఇళ్ల పట్టాల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కక్కరికి ఒక్కో అవకాశం ఇస్తాడు. ప్రజలకు మేలు చేసేందుకు నారా చంద్రబాబునాయుడు గారికి నాలుగో సారి సీఎం అయ్యే అవకాశం ఇచ్చాడు. రంజాన్ సందర్భంగా బాధ్యతగా ప్రతి ఏడాది ముస్లీం సోదరుడి నివాసాన్ని సందర్శిస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 53వేల మెజార్టీ అడిగితే ప్రజలు 91వేల మెజార్టీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. మొదటి విడతలో 3వేల ఇళ్ల పట్టాలు అందించాం. త్వరలో మరో 2వేల ఇళ్ల పట్టాలు అందిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం.

కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని హామీ
ఇఫ్తార్ విందు సందర్భంగా అమీర్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అమీర్ తల్లిదండ్రులు షేక్ అన్వర్, షెర్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తనకు ఇద్దరు కుమారులు హమీఫ్, అమీర్, ఒక కుమార్తె షమీమ్ సంతానం అని అన్వర్ తెలిపారు. కుమార్తెకు వివాహం జరిపించానని, కుమారులిద్దరూ చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నివాసముంటున్న ఇరుకు ఇంటితో ఇబ్బందులు పడుతున్నామని, వర్షం వస్తే కారుతోందని, పాత రేకుల ఇంటి స్థానంలో నూతన ఇల్లు నిర్మించి ఇవ్వాలని మంత్రి లోకేష్ ను కోరారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ వేళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తమ ఇంటిని సందర్శించడం పట్ల అమీర్, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ అమీర్ కుటుంబానికి రంజాన్ బహుమతిని అందజేశారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…