AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్!

గుంటూరు రోడ్లపై జంగిల్ రాజ… బూతుల నేతల హడావిడి..

జగన్ పరామర్శ యాత్ర ఒక టీవీ సీరియల్…బూతుల నేతలకు జగన్ సంఘీభావం..ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీ

Published : 2026-02-05 08:30:00

జగన్ పరామర్శ యాత్ర ఒక టీవీ సీరియల్…

బూతుల నేతలకు జగన్ సంఘీభావం..

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి జగన్ వెళ్లిన పరామర్శ యాత్రను ఆయన ఒక పెద్ద డ్రామాగా అభివర్ణించారు. కేవలం 34 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా, జగన్ ఏకంగా 9 గంటల పాటు సాగదీయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మునిగిపోతున్న వైకాపా నావను కాపాడుకోవడానికి, ప్రజల్లో లేని బలాన్ని ఉన్నట్లు చూపించుకోవడానికే జగన్ ఈ విధంగా టీవీ సీరియల్ తరహాలో ప్రయాణాన్ని సాగించారని ఎద్దేవా చేశారు.

బూతులు మాట్లాడే నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి, జగన్ వారికి అండగా నిలబడటం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో గంజాయి, మద్యం కేసుల్లో అరెస్టైన వారిని పరామర్శించిన జగన్, ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడే నాయకులకు మద్దతు తెలపడం ఆయన నైజానికి నిదర్శనమని అన్నారు. అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలపై నిలదీయడానికి వెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టడమే కాకుండా, దానిని దాడిగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ తావు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల జగన్ పాలనను 'జంగిల్ రాజ్' (అడవి పాలన) తో పోల్చిన అచ్చెన్నాయుడు, ఆనాడు జరిగిన దాడులను గుర్తు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర జగన్ దని విమర్శించారు. అరాచక పాలన వల్ల పరిశ్రమలు రాష్ట్రం వదిలి పారిపోయాయని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పి 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్లీ అభివృద్ధి జరుగుతుంటే, దానిని అడ్డుకోవడానికి జగన్ అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ వైఖరి వల్ల సామాన్య ప్రజలు గుంటూరు రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, సాక్షి మీడియా ఫోజుల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తన నాయకులను రెచ్చగొట్టి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి సృష్టించాలని జగన్ చూస్తున్నారని, ఇలాంటి కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. బూతుల నేతలకు సంఘీభావం తెలపడం మానేసి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.

జగన్ కు నిజంగా ప్రజా సమస్యల మీద దమ్ముంటే రోడ్లపై డ్రామాలు చేయడం ఆపి అసెంబ్లీకి రావాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి చర్చల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. అక్కడ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బయట యాత్రలు చేయడం అంటే ప్రజల నుండి పారిపోవడమేనని అన్నారు. ఇకనైనా జగన్ తన పద్ధతి మార్చుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు.

Spotlight

Read More →