LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Gurkul School: సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి!

Gurkul School: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గురువారం సింగరాయకొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు.

AndhraPravasi News Desk 1 min read
Gurkul School: సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి!

సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి డా.స్వామి..

వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేసిన మంత్రి..

సింగరాయకొండ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గురువారం సింగరాయకొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. వేసవి సెలవులు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులతో మాట్లాడి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రేపటి నుంచి సెలవులు ఉండటంతో విద్యార్థులు ఎండలో బయట తిరగకూడదని, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్లకుండా సురక్షితంగా ఉండాలని మంత్రి హితవు పలికారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, తల్లిదండ్రుల సూచనలు తప్పక పాటించాలని విద్యార్థులకు చెప్పారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అలాగే పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ సమయంలో ఉపయోగించే మీటింగ్ హాల్ పరిస్థితిని కూడా పరిశీలించిన మంత్రి… పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు ఆ హాల్‌కు అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు.

మంత్రి సందర్శనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…