Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.!

Nara Lokesh: మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేష్! మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా..

Nara Lokesh: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

Published : 2026-03-17 19:00:00
  • తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక..
     
  • విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశం..

Nara Lokesh Mylavaram: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పారు. ఘటన జరిగిన రోజు, అంత‌కుముందు భోజ‌నం ఎలా ఉంద‌ని విద్యార్థుల‌ను మంత్రి అడిగారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ ఆహారాన్ని విద్యార్థులు డస్ట్ బిన్ లో పడేసిన ఘటనపై సిబ్బందిని ఆరా తీశారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలిస్తున్నారా అని వాకబు చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీపై పవిత్ర బాధ్యత ఉంది. చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవాలి, పరిష్కరించాలి. త‌ప్పు పున‌రావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దని  మంత్రి హెచ్చరించారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యాబోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి పాఠశాల తనకు ముఖ్యమేనని, అడ్మిషన్ల పెంపుతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్ వాడీ కేంద్రం పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

మైలవరం ఘటన నేపథ్యంలో విద్యార్థులకు అందే మధ్యాహ్న భోజనం పథకంపై ఇటీవల సమీక్షించిన మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలించాలని, బాగుందని నిర్థారించాకే విద్యార్థులకు పెట్టాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. భోజనం గురించి విద్యార్థులు చెబితే తల్లిదండ్రులు వెంటనే లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

Spotlight

Read More →