LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా..

Nara Lokesh: సోషల్ మీడియాకు 13 సంవత్సరాల లోపు బాలలను దూరంగా ఉంచడంపై విధివిధానాలు తయారుచేసి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, …

AndhraPravasi News Desk 2 min read
Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా..
  • Politics: దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం..
     
  • సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు..

Nara Lokesh: సోషల్ మీడియాకు 13 సంవత్సరాల లోపు బాలలను దూరంగా ఉంచడంపై విధివిధానాలు తయారుచేసి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లి నివాసంలో  మంత్రుల బృందం... సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... సోషల్ మీడియా దుష్ప్రభావానికి లోనుకాకుండా 13 నుంచి 16సంవత్సరాల పిల్లలకు వయసు ఆధారిత కంటెంట్ ను అందుబాటులో ఉంచేవిధంగా విధివిధానాలను రూపొందించాలని  ఆదేశించారు.  

సోషల్ మీడియాలో  మహిళలపట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు, లీగల్ మెకానిజం ఫ్రేమ్ వర్క్ పై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు. పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నో బ్యాగ్ డే రోజున ఉపాధ్యాయులు  విద్యార్థులకు, ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే మెగా పిటిఎంలో కూడా తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళలభద్రతపై  స్వయంసహాయ సంఘాల మహిళలకు కూడా  అవగాహన కల్పిస్తామని తెలిపారు.

వయసు నిర్దారణ కోసం డిజిలాకర్ తో కూడిన ఏజ్ టోకెన్ ల వినియోగంపై అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయం అనంతరం కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోని అంశాలపై నివేదికను అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సున్నితమైన కంటెంట్ ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచడంపై విధివిధానాలు, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు  మంత్రుల బృందానికి వివరించారు. ఆంధ్రప్రదేేశ్ ప్రభుత్వం  తీసుకుంటున్న చొరవకు తమవంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. ఐటి చట్టంలోని సెక్షన్ – 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ (ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్), అదిరాజ్ సింగ్ రానా ఎస్పీ సైబర్ క్రైమ్,
పి.కిరణ్ కుమార్ (జాయింట్ డైరెక్టర్, ఐ & పీఆర్), పి.జయరావు, చీఫ్ జనరల్ మేనేజర్ (సోషల్ మీడియా & డిజిటల్ మీడియా, డిజిటల్ కార్పోరేషన్), ఒ.మధుసూదనరావు (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, ఐ &పీఆర్), ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు, మెటా డైరక్టర్ నటాషా జోగ్, యూట్యూబ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ మీరా స్వామినాథన్, ఎక్స్ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ జప్రీత్ గ్రెవల్, షేర్ చాట్ పాలసీ హెడ్ తమోగా గోస్వామి, జోష్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రామానుజన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…