LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Google: విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీకి ఆర్థిక ఊపు.. -మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి!

Google: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Google: విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీకి ఆర్థిక ఊపు.. -మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి!

రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీలో ఉద్యోగాల విప్లవం..

గూగుల్ రాకతో గ్లోబల్ మ్యాప్‌లో విశాఖ ప్రత్యేక స్థానం..

అమరావతి: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విశాఖతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవం పెరిగిందని ఆయన తెలిపారు.

గూగుల్ డేటా సెంటర్ ద్వారా సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును తీసుకురానుందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశముందని ఆయన వివరించారు. ఇది యువతకు పెద్ద స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

ఈ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖను ఎంపిక చేయడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ప్రపంచ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి, అంకితభావం కూడా ఈ ప్రాజెక్ట్ విజయానికి కారణమయ్యాయని చెప్పారు.

గూగుల్ రాకతో విశాఖ నగరం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. గతంలో జరిగిన భూకబ్జాల వల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నప్పటికీ, ఇప్పుడు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో విశాఖను మళ్లీ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తును మరింత బలపరుస్తాయని, పెట్టుబడులు, ఉద్యోగాల పెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…