AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల!

Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన.

Google Data Center Visakhapatnam: విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ క్లస్టర్‌కు ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ విశేషాలు

Published : 2026-04-07 17:08:00

Google Data Center Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ ముందడుగు పడబోతోంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నం వేదికగా తన డేటా సెంటర్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం, పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా రికార్డు సృష్టించనుంది.

ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించింది. అడవివరం, తర్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో మూడు వేర్వేరు చోట్ల ఈ సెంటర్లను నిర్మించనున్నారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ భూమి పూజ కార్యక్రమానికి స్వయంగా హాజరవుతుండటం విశేషం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలవనుంది.

సాంకేతికంగా ఈ డేటా సెంటర్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, వర్క్‌స్పేస్ వంటి సేవలను మరింత వేగంగా అందించడానికి ఇక్కడ భారీ ల్యాండింగ్ స్టేషన్లు, సబ్‌మెరైన్ కేబుల్స్  మెట్రో ఫైబర్ లైన్లను ఏర్పాటు చేస్తారు. 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టు అమలులో అదానీ ఇన్‌ఫ్రా కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు అవసరాల కోసం అదానీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఇప్పటికే మూడు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములను సేకరించి ఇప్పటికే గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్‌కు అప్పగించింది. దీనివల్ల స్థానికంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు, ఐటీ రంగంలో వైజాగ్ రూపురేఖలు మారిపోనున్నాయి.

 విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక పెద్ద బలాన్ని ఇవ్వనుంది. అమెరికా వెలుపల ఇంత పెద్ద ఎత్తున గూగుల్ పెట్టుబడులు పెట్టడం విశాఖపై ఆ సంస్థకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.

Spotlight

Read More →