భారతీయ సంప్రదాయంలో బ్రహ్మదేవుని కుమారుడు పుష్కరుడు ఒక నక్షత్రం ద్వారా నదిలో ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతాయి. జూపిటర్ (బృహస్పతి) ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు, ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరాలు జరుగుతాయి. ఏ నది పుష్కరాలు వచ్చినా, ఆ కాలంలో నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, పుణ్యం లభిస్తుంది అనే నమ్మకం వేల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. పుష్కరాలు జరగేది 12 ఏళ్లకు ఒకసారి, అదీ కూడా కేవలం 12 రోజులు మాత్రమే. అందుకే ఈ 12 రోజులు భక్తులకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.
పుష్కరాలు ఒక నది పండుగ మాత్రమే కాదు పుష్కరాలు జరిగే ప్రతి ప్రాంతం సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగొ మారుతుంది. లక్షలాది మందికి భక్తులతో సాంప్రదాయంగా ఇవన్నీ కలిసే పుష్కరాలు. అందుకే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రెస్టీజియస్ తీసుకుంటుంది.
ఇక 2027 గోదావరి పుష్కరాలు ముందుకొస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. ఈసారి పుష్కరాలు జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. కోటి మందికిపైగా భక్తులు రావచ్చని అంచనాలు ఉండటంతో, ఏర్పాట్లు కూడా అంతే భారీగా ఉండబోతున్నాయి.
ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు ప్రాధాన్యం మరింత ప్రత్యేకం. గోదావరి నదిని దక్షిణ గంగా అంటారు. ఈ నదిలో పుష్కరస్నానం చేయడం మహా పుణ్యం అని హిందూ శాస్త్రాలు చెబుతాయి. పుష్కరాల సందర్భంలో నదీతీర ఆలయాలు భక్తులతో కిటకిట లాడుతాయి, రాత్రంతా దీపాల వెలుగుల్లో మునిగిపోతాయి, ప్రతి చోటా యాత్రికుల రద్దీతో సందడి శోభ ఉంటుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్ల నిధులు ప్రకటించింది. ఈ నిధులు నదీ తీరాల అభివృద్ధి, ఘాట్‌లు, రోడ్లు, డ్రైనేజీ, పరిశుభ్రత, తాత్కాలిక వైద్య శిబిరాలకు వినియోగించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు బడ్జెట్‌తో ముందడుగు వేసింది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అత్యంత భారీగా, సురక్షితంగా నిర్వహించిన అనుభవం ఉన్నందున, ఈసారి కూడా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది. ముఖ్య శాఖలకు ఆదేశాలు ఇచ్చి ప్రణాళికా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.