Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

Pushkaralu: గోదావరి పుష్కరాల ముహూర్తం, కుంభమేళా తరహాలో..! భద్రత–సౌకర్యాలకు భారీ బడ్జెట్ విడుదల!

 ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అఖండ గోదావరి పుష్కరాలు–2027 ఈసారి అత్యంత ప్రాధాన్యంతో నిర్వహించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయి ఏర్పాట్లను ప్రారంభ

Published : 2025-11-26 07:56:00
Smart Cards: చంద్రబాబు కీలక నిర్ణయం! 2026 నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు QR స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అఖండ గోదావరి పుష్కరాలు–2027 ఈసారి అత్యంత ప్రాధాన్యంతో నిర్వహించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయి ఏర్పాట్లను ప్రారంభించాయి. ఇప్పటికే పుష్కరాల ముహూర్తాన్ని 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకుగా ఖరారు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ మహాయజ్ఞాన్ని కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు యత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే పుష్కరాల ఏర్పాట్ల కోసం ₹100 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసి, వివిధ శాఖలకు స్పష్టమైన బాధ్యతలను అప్పగించింది. భక్తులకు ఎక్కడైనా గోదావరిలో స్నానం చేసే అవకాశం ఉండేలా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.

Vehicle: ఏపీలో వారికి గోల్డెన్ ఛాన్స్..! 100% ఉచిత వాహనాలు... ఇప్పుడే దరఖాస్తు చేయండి!

భక్తుల రాక పెరుగుతుందని భావించి రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ₹271.43 కోట్లు కేటాయిస్తూ భారీ బడ్జెట్ ఆమోదించింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పుష్కరాల కాలంలో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. 2015లో గోదావరి పుష్కరాల తొలి రోజున చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి భద్రతపై మరింత శ్రద్ధ పెట్టనున్నారు. భక్తుల రద్దీ రోజుకు 75 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేసి, అదనపు ఘాట్లు, వైద్య శిబిరాలు, భద్రతా సిబ్బంది, బఫర్ జోన్‌లను సిద్ధం చేస్తున్నారు.

Praja Vedika: (26/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

పుష్కరాల సమగ్ర యాక్షన్ ప్లాన్ ప్రకారం, మొత్తం 8 కోట్ల మంది భక్తులు రానున్నారన్న అంచనాతో అన్ని ప్రభుత్వ శాఖలు ముందుగానే పనుల్లోకి దిగాయి. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి మాత్రమే ₹904 కోట్ల భారీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం పరిధిలో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి ₹678.76 కోట్లు, కార్పొరేషన్ రోడ్ల కోసం ₹456.5 కోట్లు, సిటీ బ్యూటిఫికేషన్–ఐకానిక్ టూరిజం ప్రాజెక్టులకు ₹75 కోట్లు ప్రతిపాదించారు. భక్తుల కోసం ఉచిత మెడికల్ క్యాంపులు, ఔషధాలు, హెల్ప్‌డెస్క్‌లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.

Air Pollution: ప్రమాదకర స్థాయికి చేరిన ఢిల్లీ వాయు కాలుష్యం..! పీఎంవో యాక్షన్ మోడ్‌లో!

ప్రభుత్వం భక్తులకు రెండు రోజులపాటు సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు “స్టే హోమ్” కాన్సెప్ట్‌ను ప్రవేశపెడుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రోజుల శిక్షణ ఇచ్చి వసతి, భోజనం, గైడ్ సేవలు అందించేలా చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు. త్వరలో ఆయన సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అన్ని ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళికను ఖరారు చేయనున్నారు. కుంభమేళా స్థాయి భద్రత, సౌకర్యాలు, రవాణా, వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

AP Development: శుభవార్త.. 19 ఏళ్ల కల సాకారం! విజయవాడ-కాజీపేట మార్గంలో.. త్వరలో ప్రారంభం!
AP Logistics: ఏపీలో లాజిస్టిక్స్ విప్లవం.. 'ఏపీ-లింక్' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆడపిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం.. 4 కోట్ల ఖాతాలు, రూ. 3.25 లక్షల కోట్లు జమ! వెంటనే దరఖాస్తు చేస్కోండి!
AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..
గల్ఫ్ ఎన్నారై పాలసీ అధ్యయనం కోసం డిసెంబర్‌లో జిల్లాల పర్యటన! డిసెంబర్ 3, 4 తేదీల్లో..
Global Politics: అలాస్కా ఒప్పందమే కీలకం… ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై అమెరికాకు రష్యా స్పష్టమైన హెచ్చరిక!!

Spotlight

Read More →