ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి? Praja Vedika: నేడు (05/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Sunil Nayak: నేడు పోలీసుల ముందుకు సునీల్ నాయక్... RRR కేసులో కీలక విచారణ! Iran-Israel: ఇరాన్‌లో ఉద్రిక్తత! నిలిచిపోయిన ఇంటర్నెట్, వాయిదా పడ్డ ఖమేనీ అంత్యక్రియలు... Airport: ఏపీలో ఆ విమానాశ్రయానికి మహర్దశ! రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి? Praja Vedika: నేడు (05/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Sunil Nayak: నేడు పోలీసుల ముందుకు సునీల్ నాయక్... RRR కేసులో కీలక విచారణ! Iran-Israel: ఇరాన్‌లో ఉద్రిక్తత! నిలిచిపోయిన ఇంటర్నెట్, వాయిదా పడ్డ ఖమేనీ అంత్యక్రియలు... Airport: ఏపీలో ఆ విమానాశ్రయానికి మహర్దశ! రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్!

AP Irrigation Projects: గోదావరి డెల్టాకు మహర్దశ... 10 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం - అసెంబ్లీలో మంత్రి నిమ్మల వ్యాఖ్యలు..!

Godavari Delta Modernization: గోదావరి డెల్టా పరిధిలోని 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ₹13.4 కోట్లతో లైడార్ సర్వే నిర్వహించి, ముంపు నివారణకు కాలువల ఆధునీకరణకు సమగ్ర డీపీఆర్ తయారు చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు.

Published : 2026-03-05 12:10:00

AP Assembly Updates: అమరావతి అసెంబ్లీ వేదికగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి డెల్టా రైతాంగానికి  భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాల పరిధిలోని 4.83 లక్షల ఎకరాలతో పాటు, వెస్ట్రన్ డెల్టాలోని 5.29 లక్షల ఎకరాలకు సాగునీటి కష్టాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని సభలో వివరించారు.

గోదావరి డెల్టా వ్యవస్థలో ప్రధాన సమస్యగా మారిన ముంపును నివారించేందుకు ప్రభుత్వం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. ఇందుకోసం సుమారు 13.4 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 'లైడార్ సర్వే'ను నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సర్వే ద్వారా వచ్చే కచ్చితమైన నివేదిక ఆధారంగా ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) సిద్ధం చేస్తామని, దీనివల్ల డెల్టా ఆధునీకరణ పనులు పక్కాగా జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న కీలక పనులన్నింటినీ పూర్తి చేయనున్నారు. కాలువలు, డ్రైన్లలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను తీయడం, కాలువల గట్లు మరియు లైనింగ్ పనులు పూర్తి చేయడం వంటి పనులు చేపడతారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన గేట్లు, స్లూయిస్లు, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా బెడ్ లెవల్స్‌ను సరిచేస్తామని మంత్రి వెల్లడించారు.

గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ డెల్టా ఆధునీకరణ పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా పనులను అర్ధాంతరంగా ఆపేసిందని విమర్శించారు. కనీసం కాలువల నిర్వహణ (O&M) పనులు కూడా చేయకపోవడం వల్ల సాగునీరు అందక రైతులు అల్లాడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు గోదావరి డెల్టాలో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, కాలువ చివరి ఎకరం వరకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రామానాయుడు పేర్కొన్నారు. సాగునీటి వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రైతుల పంటలకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల రైతాంగం మళ్ళీ పూర్వ వైభవం సాధించేలా, వ్యవసాయం లాభసాటిగా మారేలా ఈ ఆధునీకరణ పనులు ఉంటాయని మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Spotlight

Read More →